Home /News /business /

MORE CHECK FOR FRAUD IN DIGITAL LOANS RBIS NEW RULES YOU WILL BE HAPPY IF YOU READ IT UMG GH

Digital Loans: డిజిటల్ లోన్స్‌లో మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త రూల్స్.. నేరుగా ఆ డబ్బు మీ అకౌంట్‌లోకే..!

 డిజిటల్ లోన్స్ లో మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త రూల్స్ .. చదివితే సంతోషిస్తారు !

డిజిటల్ లోన్స్ లో మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త రూల్స్ .. చదివితే సంతోషిస్తారు !

డిజిటల్ రుణాల (Digital Loans) రంగంలో పెరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి కఠినమైన నిబంధనలను రూపొందిస్తోంది. డిజిటల్ రుణాలను థర్డ్ పార్టీల ద్వారా కాకుండా నేరుగా రుణగ్రహీతల బ్యాంక్ అకౌంట్లలో జ

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
డిజిటల్ రుణాల (Digital Loans) రంగంలో పెరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి కఠినమైన నిబంధనలను రూపొందిస్తోంది. డిజిటల్ రుణాలను థర్డ్ పార్టీల ద్వారా కాకుండా నేరుగా రుణగ్రహీతల బ్యాంక్(Bank) అకౌంట్లలో జమ చేయాలని బుధవారం ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు (LSP)చెల్లించాల్సిన ఫీజులు లేదా ఇతర ఛార్జీలను రుణగ్రహీతలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఆ ఛార్జీలను డిజిటల్‌ రుణాలు ఇచ్చే సంస్థలే భరించాలని ఆర్బీఐ పేర్కొంది.

డిజిటల్‌ లోన్స్‌పై ఆర్‌బీఐ మార్గదర్శకాలు
డిజిటల్ రుణాలపై ఆర్‌బీఐ వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాథమికంగా థర్డ్ పార్టీల ప్రమేయం, మిస్‌ సెల్లింగ్‌, డేటా ఉల్లంఘన, అన్యాయమైన వ్యాపార(Business) ప్రవర్తన, అధిక వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక రికవరీ పద్ధతులకు సంబంధించిన ఆందోళనల గురించి ఆర్‌బీఐ ప్రస్తావించింది.
2021 జనవరి 13న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా రుణాలు ఇవ్వడంతో సహా డిజిటల్ రుణాలపై (WGDL) వర్కింగ్ గ్రూప్‌ను ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది.

డిజిటల్‌ రుణాల ప్రక్రియలో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, డిజిటల్ లెండింగ్ పద్ధతుల ద్వారా క్రెడిట్ డెలివరీ క్రమమైన వృద్ధికి సపోర్ట్‌ ఇచ్చే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ పటిష్టంగా ఉందని తెలిపింది. ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్.. రుణ వ్యాపారాన్ని రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలోని సంస్థలు లేదా మరేదైనా చట్టం ప్రకారం అనుమతి పొందిన సంస్థల ద్వారా మాత్రమే నిర్వహించాలనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది.

ఛార్జీలు రెగ్యులేటెడ్‌ ఎంటిటీలే చెల్లించాలి
రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఆర్‌బీఐకి చెందిన రెగ్యులేటెడ్ ఎంటిటీల(REs) డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్‌పై దృష్టి సారించింది. వివిధ క్రెడిట్ ఫెసిలిటేషన్ సేవలను విస్తరించడానికి లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు పని చేస్తున్నాయి. ఎల్‌ఎస్‌పీ లేదా ఏదైనా థర్డ్ పార్టీ పాస్-త్రూ/పూల్ ఖాతా లేకుండా రుణగ్రహీత, ఆర్‌ఇ బ్యాంకు ఖాతాల మధ్య మాత్రమే అన్ని రుణ పంపిణీలు, చెల్లింపులు జరగాలని ఆర్‌బీఐ తెలిపింది. క్రెడిట్‌ ఇంటర్మీడియేషన్‌ ప్రాసెస్‌లో ఎల్‌ఎస్‌పీలకు చెల్లించాల్సిన ఏవైనా రుసుములు, ఛార్జీలు నేరుగా రెగ్యులేటెడ్‌ ఎంటిటీలు చెల్లించాలని, రుణగ్రహీతలు కాదని పేర్కొంది. రుణ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందు రుణగ్రహీతకు తప్పనిసరిగా కకీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌(KFS) అందించాలని పేర్కొంది.

30 రోజుల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలి
రుణగ్రహీత దాఖలు చేసిన ఏదైనా ఫిర్యాదు నిర్ణీత వ్యవధిలో (ప్రస్తుతం 30 రోజులు) రెగ్యులేటెడ్‌ ఎంటిటీలు పరిష్కరించకపోతే.. వారు రిజర్వ్ బ్యాంక్ - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్(RB-IOS) కింద ఫిర్యాదు చేయవచ్చు. DLAలు సేకరించే డేటా అవసరమైనదిగా ఉండాలని, స్పష్టమైన ఆడిట్ ట్రయల్స్ చేయాలని, రుణగ్రహీత నుంచి ముందస్తు స్పష్టమైన సమ్మతి తీసుకోవాలని ఆర్‌బీఐ పేర్కొంది.

ఇదీ చదవండి:  Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !


 DLAలు/LSPలు రుణగ్రహీతల నుంచి సేకరించిన డేటాను తొలగించే ఆప్షన్‌తో పాటు.. గతంలో మంజూరు చేసిన అనుమతిని రద్దు చేసుకొనే అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ తెలిపింది. అదే విధంగా నిర్దిష్ట డేటాను ఉపయోగించడం కోసం అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరించే సదుపాయాన్ని రుణ గ్రహీతలకు కల్పించాలని పేర్కొంది.ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ కొన్ని సిఫార్సులను సూత్రప్రాయంగా ఆమోదించిందని, అయితే వాటికి తదుపరి పరిశీలన అవసరమని తెలిపింది. సాంకేతిక సంక్లిష్టతలు, సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, శాసనపరమైన జోక్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం, ఇతర వాటాదారులతో చర్చించడం అవసరమని తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: Bank fraud, Banks, Loan apps, Rbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు