హోమ్ /వార్తలు /బిజినెస్ /

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

Moratorium on EMIs | మీరు మీ హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వేస్తున్నారా? మూడు నెలలు చెల్లించొద్దని నిర్ణయించుకున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి.

మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రుణాలపై విధించిన మారటోరియంను ఎంచుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. మీరు మారటోరియం ఎంచుకునేముందు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. ఈఎంఐలు వాయిదా వేయడం వల్ల వచ్చే లాభం కన్నా, నష్టాలపైన దృష్టి పెట్టాలి. దీనిపై మనీకంట్రోల్ ఓ కథనం పబ్లిష్ చేసింది. మీరు 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు అదనంగా చెల్లించాల్సి రావొచ్చని ఉదాహరణతో సహా వివరించింది. ఎలాగో మీరూ తెలుసుకోండి. మీరు మూడు ఈఎంఐలు వాయిదా వేస్తే మీ లోన్ టెన్యూర్ మరో మూడు నెలలు పెరుగుతుందని అనుకుంటున్నారా? అయితే తప్పే. మొదట్లో చాలామంది ఇలాగే అనుకున్నారు. కానీ... ఆ తర్వాత ఎన్ని ఈఎంఐలు చెల్లించాలన్నది మీ ఔట్‌స్టాండింగ్ పైన, దానిపై ఈ మూడు నెలల్లో చెల్లించాల్సిన వడ్డీపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఈ మూడు నెలల్లో ఎంత వడ్డీ అవుతుందో ఆ వడ్డీ మీ ఔట్‌స్టాండింగ్‌లో కలిసిపోతుంది. దాని ప్రకారం మీరు అదనంగా ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. మీరు రూ.50,00,000 హోమ్ లోన్ 8 శాతం వడ్డీకి 240 నెలల కాలానికి తీసుకున్నారనుకుందాం. అంటే రూ.41,822 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం వడ్డీ 50,37,281 అవుతుంది. ఒకవేళ మారటోరియం తీసుకుంటే ఎంత అదనంగా చెల్లించాలో ఈ ఉదాహరణలు చూడండి.

ఉదాహరణ 1: ఇప్పటి వరకు మీరు 3 ఈఎంఐలు చెల్లించారు. ఇంకా 237 ఈఎంఐలు చెల్లించాలి. మారటోరియం తీసుకున్నారు కాబట్టి 253 ఈఎంఐలు చెల్లించక తప్పదు. అంటే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి. మొత్తం వడ్డీ రూ.55,42,322 అవుతుంది. అదనంగా మీరు చెల్లించే వడ్డీ రూ.5,05,041. ఒకవేళ మీరు మారటోరియం ముగిసిన తర్వాత 237 ఈఎంఐలు చెల్లించడానికి ఒప్పుకుంటే అప్పుడు మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.42,890 అవుతుంది. అంటే మొదట్లో రూ.41,822 గా ఉన్న ఈఎంఐ రూ.42,890 అవుతుంది.

Coronavirus Pandemic, RBI moratorium on EMIs, EMI moratorium Home loan, EMI moratorium advantages and disadvantages, moratorium example, Credit card bills, కరోనావైరస్ మహమ్మారి, ఈఎంఐలపై ఆర్‌బీఐ మారటోరియం, హోమ్ లోన్ మారటోరియం, క్రెడిట్ కార్డ్ బిల్లులు
Source: Moneycontrol

ఉదాహరణ 2: ఇప్పటి వరకు మీరు 120 ఈఎంఐలు చెల్లించారు. ఇంకా 120 ఈఎంఐలు చెల్లించాలి. మారటోరియం తీసుకున్నారు కాబట్టి 127 ఈఎంఐలు చెల్లించక తప్పదు. అంటే 7 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి. మొత్తం వడ్డీ రూ.51,93,795 అవుతుంది. అదనంగా మీరు చెల్లించే వడ్డీ రూ.1,56,514. ఒకవేళ మీరు మారటోరియం ముగిసిన తర్వాత 120 ఈఎంఐలు చెల్లించడానికి ఒప్పుకుంటే అప్పుడు మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.43,380 అవుతుంది. అంటే మొదట్లో రూ.41,822 గా ఉన్న ఈఎంఐ రూ.43,380 అవుతుంది.

ఉదాహరణ 3: ఇప్పటి వరకు మీరు 234 ఈఎంఐలు చెల్లించారు. ఇంకా 6 ఈఎంఐలు చెల్లించాలి. మారటోరియం తీసుకున్నారు కాబట్టి 10 ఈఎంఐలు చెల్లించక తప్పదు. అంటే 4 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి. మొత్తం వడ్డీ రూ.50,42,452 అవుతుంది. అదనంగా మీరు చెల్లించే వడ్డీ రూ.5,171. ఒకవేళ మీరు మారటోరియం ముగిసిన తర్వాత 6 ఈఎంఐలు చెల్లించడానికి ఒప్పుకుంటే అప్పుడు మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.84,486 అవుతుంది. అంటే మొదట్లో రూ.41,822 గా ఉన్న ఈఎంఐ రూ.84,486 అవుతుంది.

అంటే... మీరు ఏ దశలో ఉన్నా మారటోరియం ఎంచుకుంటే మీకు అదనపు భారం తప్పదు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే ఈఎంఐలు వాయిదా వేయకపోవడం మంచిది. డబ్బులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తప్ప ఈఎంఐలు వాయిదా వేయకూడదు. మీ బ్యాంకులు మారటోరియంపై వెల్లడించిన నియమనిబంధనల్ని పూర్తిగా చదవండి. ఆ తర్వాతే మారటోరియం ఆప్షన్ ఎంచుకోండి.

ఇవి కూడా చదవండి:

EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...

Insurance Policy: కరోనాతో చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

SBI: ఎస్‌బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన బ్యాంక్

First published:

Tags: Bank loans, Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Home loan, Housing Loans, Lockdown, Personal Finance, Personal Loan, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు