Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తే ఎంత నష్టమంటే...

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తే ఎంత నష్టమంటే... (ప్రతీకాత్మక చిత్రం)

RBI Moratorium on Credit Card Bills | మీరు క్రెడిట్ కార్డు బిల్లు ఇంకా చెల్లించలేదా? ఆర్‌బీఐ ఇచ్చిన మారటోరియం ఆప్షన్ తీసుకుంటున్నారా? అయితే మీరు ఎంత నష్టపోతారో తెలుసుకోండి.

  • Share this:
    మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సి ఉందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇచ్చిన మూడు నెలల మారటోరియం ఆప్షన్ వాడుకుందామనుకుంటున్నారా? మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే భారీగా నష్టపోవాల్సిందే. ఎందుకంటే క్రెడిట్ కార్డుపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. అసలు మీరు క్రెడిట్ కార్డుపై ఎంత వడ్డీ చెల్లించాల్లించాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. ఇప్పుడు మీరు మారటోరియం ఎంచుకుంటే 30 నుంచి 40 శాతం వడ్డీ చెల్లించక తప్పదు. మీరు మూడు నెలలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నా ఆ తర్వాత వడ్డీతో కలిపి బిల్లు ఎక్కువగా చెల్లించక తప్పదు. అసలు మీరు ఎంత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందో బ్యాంకులే వివరించాయి.

    వడ్డీ నెలకు రూ.3.5 శాతం అనుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీ ఎంతో మరో ఉదాహరణ చూడండి.

    మార్చి 3న చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్లు- రూ.1,00,000
    ఏప్రిల్ 3 నాటికి వడ్డీ- రూ.3,500
    మే 3 నాటికి మొత్తం వడ్డీ- రూ.7,122
    జూన్ 3 నాటికి మొత్తం వడ్డీ- రూ.10,871
    జూన్ 3న మీరు చెల్లించాల్సిన మొత్తం- రూ.1,10,871

    Coronavirus Pandemic, RBI Moratorium on Credit Card Bills, RBI moratorium on EMIs, EMI moratorium disadvantages, credit card bill moratorium example, how to apply for moratorium, క్రెడిట్ కార్డ్ బిల్లుపై మారటోరియం, ఈఎంఐలపై ఆర్‌బీఐ మారటోరియం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం, ఈఎంఐ మారటోరియం నష్టాలు
    Source: Moneycontrol


    అంటే రూ.1,00,000 క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుండా మీరు మూడు నెలలు మారటోరియం ఎంచుకుంటే అదనంగా వడ్డీ రూ.10,871 చెల్లించాలి. యాక్సిస్ బ్యాంకు ఇచ్చిన మరో ఉదాహరణ ఇది.

    ఫిబ్రవరి 12న మీ క్రెడిట్ కార్డుతో ఖర్చు చేసిన మొత్తం- రూ.10,000
    మీ బిల్ జనరేట్ అయిన తేదీ- మార్చి 12
    ఏప్రిల్ 12 నాటికి క్రెడిట్ కార్డు డ్యూ- రూ.10,000
    మారటోరియం ఎంచుకుంటే మీరు కట్టాల్సిన వడ్డీ+జీఎస్‌టీ- రూ.1,739
    2020 జూన్ 12న మీరు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు- రూ.11,739

    అంటే రూ.10,000 బిల్లుకు మారటోరియం ఎంచుకుంటే మీరు రూ.11,739 చెల్లించాలి. అదనంగా మీరు రూ.1,739 చెల్లించాలన్నమాట. అందుకే మీ దగ్గర డబ్బులు ఉంటే క్రెడిట్ కార్డు బిల్లు తప్పని సరిగా చెల్లించాల్సిందే. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...

    Digital Payments: ఈ పేమెంట్స్ అన్నీ ఇంటి నుంచే చేయొచ్చు

    SBI phone banking: మీ ఫోన్ నుంచే ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు ఇలా
    Published by:Santhosh Kumar S
    First published: