Moody's Rate : 2020 GDP వృద్ధిరేటును తగ్గించేసిన మూడీస్... ఇలాగైతే కష్టమంటూ కామెంట్...

Moody's Rate 2020-21 : ఓవైపు కేంద్ర ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని చెబుతుంటే... మూడీస్ మాత్రం అంత సీన్ లేదంటూ రేటింగ్స్ తగ్గించేస్తోంది.

news18-telugu
Updated: February 17, 2020, 1:28 PM IST
Moody's Rate : 2020 GDP వృద్ధిరేటును తగ్గించేసిన మూడీస్... ఇలాగైతే కష్టమంటూ కామెంట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Moody's GDP growth rate for 2020-21 : 2020-21కి భారత దేశ వృద్ధి రేటు అంచనాను మరింత తగ్గించేసింది ప్రపంచ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్. తాజా అంచనా ప్రకారం భారత్ 2020-21లో 5.4 శాతం మాత్రమే వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. పైగా భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునేలా లేదని అభిప్రాయపడింది. తాజా రిపోర్టులో మూడీస్ కొన్ని ప్రత్యేక అంశాల్ని లెక్కలోకి తీసుకుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంటూ... వృద్ధిరేటు పెరిగే అవకాశాలు కనిపించకపోవడాన్ని లెక్కలోకి తీసుకున్న మూడీస్... దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశాలు నిస్సారంగా (Shallow) ఉన్నాయని తెలిపింది.

"రెండేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మందగమనంవైపు వెళ్తోంది. నిజమైన జీడీపీ (GDP - స్థూల జాతీయోత్పత్తి) 2019 మూడో క్వార్టర్‌లో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)లో 4.5 శాతంగా ఉంది. PMI (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) వంటి హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లలో మెరుగదల డేటాను చూస్తే... ఇండియన్ ఎకానమీ... స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత క్వార్టర్‌లో (జనవరి నుంచీ మార్చి వరకు) ఎకానమీ రికవరీ అవుతుందని అనుకుంటే... అది ఇదివరకు అంచనా వేసుకున్న దానికంటే... తక్కువగా ఉండేలా ఉంది"
మూడీస్.


2020లో 5.4గా ఉన్న వృద్ధి రేటు అంచనాల్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి మాత్రమే పెంచగలమని మూడీస్ తెలిపింది. ఇంతకుముందు ఇదే మూడీస్... 5.8 బదులు... 6.6 నుంచీ 6.7 ఉండొచ్చని అంచనా వేసింది. ఇండియా కోలుకోవాలంటే... గ్రామాలు, పట్టణాల్లో ప్రజల నుంచీ కొనుగోలు శక్తి పెరగాలనీ, డిమాండ్ పెరగాలని మూడీస్ చెబుతోంది. ఇది అవసరం అని కూడా అంటోంది.

"RBI (రిజర్వ్ బ్యాంక్) ప్రకారం... గతేడాది ఎకానమీలో రుణ లభ్యత తక్కువగా ఉంది. బ్యాంకింగేతర ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు ఇచ్చే రుణాలు బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నా... భారత బ్యాంకులు మాత్రం తమ వడ్డీ రేట్లను తగ్గించట్లేదు. ప్రజలకు ఇస్తున్న రుణాలపై ఎక్కువ వడ్డీలు తీసుకుంటున్నాయి. ఫలితంగా నాన్-ఫుడ్ బ్యాంక్ క్రెడిట్ వృద్ధి రేటు... 2018లో 12.8 శాతం ఉండగా... 2019 డిసెంబర్ నాటికి అది 7.0కి పడిపోయింది"
మూడీస్




ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (covid-19) ప్రభావం చైనాతోపాటూ... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని మూడీస్ అభిప్రాయపడింది. 2020-21లో జీ20 దేశాల సమీకృత వృద్ధిరేటు 2.4 శాతం ఉండొచ్చన్న మూడీస్... 2021లో అది 2.8 శాతానికి చేరగలదని అంచనా వేసింది. ప్రస్తుతానికి 2020-21లో మొదటి క్వార్టర్‌ (ఏప్రిల్, మే, జూన్)పై కరోనా వైరస్ ప్రభావం ఉండొచ్చని తెలిపింది. రెండో క్వార్టర్ (జులై, ఆగస్ట్, సెప్టెంబర్)లో మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మెరుగవుతాయని చెప్పింది.
First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు