పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే దేశ ప్రజలందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. కొత్త పథకాలు ఏం తెస్తున్నారు? ఏయే ధరలు పెరగబోతున్నాయి? మనకు ఏమైనా లాభం జరుగుతుందా? లేదంటే భారం పడుతుందా? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీవీలతో పాటు మొబైల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుంటారు. ఐతే బడ్జెట్ రోజున ఎక్కువ మంది వీక్షించిన డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏంటో తెలుసా..? మనీ కంట్రోల్. అవును ఫిబ్రవరి 1న దేశంలో అత్యధిక మంది మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌నే వీక్షించారు. వేగవంతమైన అప్డేట్స్, ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంతో ఎక్కువ శాతం ఆడియెన్స్ మనీ కంట్రోల్‌నే తమ ఛాయిస్‌గా ఎంచుకున్నారు.
ఫైనాన్షియల్ ఈవెంట్స్‌కు సంబంధించి రీడర్స్ వివరాలను వెల్లడించే సిమిలార్ వెబ్ (SimilarWeb) డేటా ప్రకారం బడ్జెట్ రోజున తమ పోటీ సంస్థలైన ఎకనామిక్ టైమ్స్, లైవ్ మింట్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ మంది మనీ కంట్రోల్‌ను వీక్షించారు. ఎకనామిక్ టైమ్స్ కంటే 21 శాతం, లైవ్ మింట్ కంటే 77 శాతం, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కంటే 108 శాతం ఎక్కువ మంది నెటిజన్లు మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌ను సందర్శించారు. కేంద్ర బడ్జెట్ 2021కి సంబంధించి లైవ్ అప్డేట్స్, లోతైన విశ్లేషణ అందించడంతో అందరూ మనీ కంట్రోల్‌నే విశ్వసించారు.
మనీ కంట్రోల్ లైవ్ బ్లాగ్ ద్వారా రియిల్ టైమ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు యూజర్లు. సీనియర్ ఎడిటర్ల బృందం, ఇన్‌హౌస్ ఎనలిస్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా బడ్జెట్లోని అన్ని అంశాలను గురించి విడమరిచి వివరించారు. స్మార్ట్ విజువల్ కార్డ్ వంటి అధునాత ఫీచర్ ద్వారా ప్రతి రంగానికి సంబంధించి బడ్జెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అత్యంత వేగంగా, ఖచ్చితమైన సమాచారంతో పబ్లిష్ చేశారు.
'' ప్రతి ఏటా యూనియన్ బడ్జెట్ అనేది మన దేశంలో అతి పెద్ద ఆర్థిక కార్యక్రమం. మనీ కంట్రోల్ జర్నలిస్టులు, డిజైనర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు, ఇంజినీర్లు కలిసికట్టుగా పనిచేసి యూజర్లకు అద్భుతమైన అనుభూతి ల్పించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా మా వెబ్‌సైట్‌ను వీక్షకులు ఆదరించడం సంతోషంగా ఉంది.'' అని బినోయ్ ప్రభాకర్ పేర్కొన్నారు.
రీబిల్డింగ్ ఇండియా థీమ్‌తో యూజర్లకు బడ్జెట్‌కు సంబంధించిన అప్డేట్స్, స్టోరీలు, విశ్లేషణను మనీ కంట్రోల్ అందించింది. బడ్జెట్ ప్రభావం ఇన్వెస్టర్లు, వ్యాపారులు, సాధరణ ప్రజలపై ఎలా ఉండబోతోందన్న అంశాలను సవివరంగా పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వీడియోలు, ప్రొడోకాస్ట్ వంటి విభిన్నమైన రూపాల్లో కథనాలను యూజర్లలకు అందజేశారు. అంతేకాదు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే, ఎక్స్పెండిచర్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ప్రఖ్యాత కార్పొరేట్ లాయర్స్ జియా మోడి, సిరిల్ ష్రాఫ్ ఎండీ అమర్ చంద్ మంగల్దాస్, ఆర్థిక నిపుణులు ఆశిష్ శంకర్ సహా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి బడ్జెట్‌పై సామాన్యులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఇలా సమగ్ర వివరాలను అందించినందుకే బడ్జెట్ రోజున మనీ కంట్రలో నెంబర్ వన్‌గా నిలిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2021, Money, Union Budget 2021