MONEYCONTROL PRO COMPLETES A YEAR AIMS TO OFFER MORE VALUE TO ITS SUBSCRIBERS SS
Moneycontrol Pro: మనీకంట్రోల్ ప్రో ఫస్ట్ యానివర్సరీ... యూజర్లకు రూ.20,000 విలువైన బెనిఫిట్స్
Moneycontrol Pro: మనీకంట్రోల్ ప్రో ఫస్ట్ యానివర్సరీ... యూజర్లకు రూ.20,000 విలువైన బెనిఫిట్స్
Moneycontrol Pro First Anniversary | కరోనా వైరస్ భయాలను గుర్తించి ముందస్తు హెచ్చరికలు, విశ్లేషణల, మహమ్మారి ప్రభావం ఉండే రంగాల గురించి సమాచారం అందించి ఇన్వెస్టర్లకు మద్దతుగా నిలిచింది మనీకంట్రోల్ ప్రో.
మనీకంట్రోల్... బిజినెస్, స్టాక్ మార్కెట్స్ రంగాల్లో ఉన్నవారికి పరిచయం అక్కర్లేని న్యూస్ ప్లాట్‌ఫామ్. సరిగ్గా ఏడాది క్రితం 'మనీ కంట్రోల్ ప్రో' ప్రారంభమైంది. సబ్స్క్రైబర్లకు ప్రీమియం ఫైనాన్షియల్ కంటెంట్ అందించేందుకు నెట్వర్క్18 గ్రూప్ 'మనీ కంట్రోల్ ప్రో'ను ప్రారంభించింది. 2019 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ డిజిటల్ బిజినెస్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్నసబ్స్క్రిప్షన్ ప్రొడక్ట్‌గా పేరుతెచ్చుకుంది. తక్కువ సమయంలోనే 1,60,000 మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. ఫస్ట్ యానివర్సరీ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లకు రూ.20,000 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. పాత యూజర్లతో పాటు కొత్త యూజర్స్ ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరిన్ని అత్యుత్తమమైన సేవలు అందించడంతో పాటు, మరింత పరిశోధనలతో, విశ్లేషణలతో వినియోగదారులకు సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తామంటోంది మనీకంట్రోల్.
అంతర్దృష్టితో ముందుగు సాగడం, మరింత లోతుగా అవగాహన చేసుకోవడం, ఈ ప్రొడక్ట్‌కు మరిన్ని మెరుగులు దిద్దడం, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మనీకంట్రోల్ ప్రో ఫైనాన్షియల్ న్యూస్, డేటా, విశ్లేషణల వేదికగా మారింది. మాకు ఆడియన్స్ నుంచి నిరంతరాయంగా వస్తున్న మద్దతుకు ఈ మైలురాయి ఓ నిరదర్శనం. మా సేవల్ని మరింత మెరుగుపర్చేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుంది.
— పునీత్ సింఘ్వీ, ప్రెసిడెంట్, డిజిటల్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ, నెట్వర్క్18
మనీకంట్రోల్ ప్రో ఏర్పాటైన దగ్గర్నుంచి యూజర్లకు నిపుణుల నుంచి టెక్నికల్ అనాలిసిస్, ట్రేడింగ్ ఐడియాస్, రోజూ సమగ్రమైన న్యూస్‌లెటర్, వీకెండ్లో సమీక్ష లాంటివి అందిస్తోంది. ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్‌తో పాటు యాడ్స్ లేకుండా యాప్, వెబ్సైట్ ఉపయోగించే అవకాశం కల్పిస్తోంది. ఉదాహరణకు 'గురుస్పీక్' ద్వారా మార్కెట్లో విజయవంతమైన నిపుణుల విజయరహస్యాలను అందిస్తుంటే, పర్సనల్ ఫైనాన్స్ సెక్షన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్, అసెట్ అలకేషన్స్కు సంబంధించిన సందేహాలు తీర్చడం విశేషం.
మారుతున్న కాలానుగుణంగా సరికొత్త మార్గాలను అన్వేషించడం, అలవర్చుకోవడం ద్వారా సేవలు అందిస్తూ మనీ కంట్రోల్ ప్రో నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 'లెర్న్' సిరీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ సూత్రాలు, స్టైల్, ఆర్థిక నిష్పత్తులతో యూజర్లు కంపెనీలు, స్టాక్స్ గురించి సొంత అభిప్రాయాలు పెంపొందించుకుంటున్నారు.
— మనోజ్ నాగ్‌పాల్, బిజినెస్ హెడ్, బీ2సీ రెవెన్యూస్, మనీకంట్రోల్
కరోనా వైరస్ భయాలను గుర్తించి ముందస్తు హెచ్చరికలు, విశ్లేషణల, మహమ్మారి ప్రభావం ఉండే రంగాల గురించి సమాచారం అందించి ఇన్వెస్టర్లకు మద్దతుగా నిలిచింది మనీకంట్రోల్ ప్రో. అంతేకాదు మార్కెట్లు కుప్పకూలిన తర్వాత మళ్లీ పోర్ట్‌ఫోలియోను ఎలా నిర్మించుకోవాలో తెలియజేసింది. మనీకంట్రోల్ ప్రో యానివర్సరీ సందర్భంగా వరుసగా ఆర్టికల్స్‌ని పబ్లిష్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.