Credit Card: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి

మీరు మీ క్రెడిట్ కార్డు నుండి మీ బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేసే సందర్భంలో దానిపై కొంత వడ్డీ మొత్తం వసూలు చేయబడుతుందని గుర్తుంచుకోండి. అయితే, మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లిస్తే, మీ నుంచి వడ్డీ వసూలు చేయబడదు.

news18-telugu
Updated: November 3, 2020, 12:02 PM IST
Credit Card: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి
Credit Card: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
క్రెడిట్ కార్డులతో ఉన్న అనేక ప్రయోజనాల దృష్ట్యా వీటిని ఉపయోగించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. క్రెడిట్ కార్డు వాడే వారికి ఆయా బ్యాంకులు రివార్డ్ పాయింట్లు, క్యాష్బ్యాక్, డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, లోన్ ఫెసిలిటీ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తుండటం కూడా దీనికి మరో కారణంగా చెప్పవచ్చు. అయితే, ఈ కార్డులు కేవలం వస్తువుల కొనుగోలు, బిల్ పేమెంట్ల చేయడం వంటి అవసరాలకే కాకుండా మనీ ట్రాన్స్‌ఫర్‌కు కూడా ఉపయోగపడుతాయి. క్రెడిట్ కార్డు నుండి తక్కువ సమయంలోనే మనీ ట్రాన్స్‌ఫర్ అవకాశం ఉండటం, దీనికి ఆయా బ్యాంకులు తక్కువ వడ్డీని వసూలు చేస్తుండటంతో క్రెడిట్ కార్డుల నుంచి వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మీరు కూడా మీ క్రెడిట్ కార్డు నుంచి మీ ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి.

క్రెడిట్ కార్డు నుండి బ్యాంక్ ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేసే విధానం



క్రెడిట్ కార్డుతో మీ గృహ అవసరాల కోసం వాడే వస్తువులను కొనుగోళ్ల చేయవచ్చు. అయితే, దీనితో మీ హోమ్ లోన్, కార్ లోన్లను మాత్రం చెల్లించలేరు. ఇలాంటి సందర్భాల్లో, మీ క్రెడిట్ కార్డు నుండి మీ బ్యాంక్ ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం ఆచరణీయమైన ఎంపిక అవుతుంది. అత్యవసర సమయాల్లో ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. అయితే, మీరు మీ క్రెడిట్ కార్డు నుండి డబ్బును మీ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే సందర్భంలో ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోండి.

SBI Debit Card: ఏటీఎం కార్డు పోయిందా? సింపుల్‌గా బ్లాక్ చేయండిలా

Gold: ఒక్క రూపాయికే బంగారం... మీరూ కొనండి ఇలా

వడ్డీ రేట్లను పరిగణించండి


మీరు మీ క్రెడిట్ కార్డు నుండి మీ బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేసే సందర్భంలో దానిపై కొంత వడ్డీ మొత్తం వసూలు చేయబడుతుందని గుర్తుంచుకోండి. అయితే, మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లిస్తే, మీ నుంచి వడ్డీ వసూలు చేయబడదు. ఒకవేళ మీరు మీ కార్డు నుండి బ్యాంకుకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే మాత్రం వడ్డీ వసూలు చేయబడుతుందని గుర్తించుకోండి.

ఫీజు చెల్లించాల్సి ఉంటుంది


మీరు మీ క్రెడిట్ కార్డు నుండి మీ బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తే, మీ నుంచి ఫీజు వసూలు చేయబడుతుంది. ఫీజు రేటు మీ కార్డ్ ప్రొవైడర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా 3-4 శాతం వరకు ఉంటుంది.

క్రెడిట్ కార్డు నుండి బ్యాంక్ ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా?


మీ క్రెడిట్ కార్డు నుండి మీ బ్యాంక్ అకౌంట్కు మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి వైర్ ట్రాన్సాక్షన్స్ బాగా ప్రాచుర్యం పొందిన మార్గంగా చెప్పవచ్చు. ప్రభుత్వం పొందుపర్చిన రెగ్యులేటరీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ట్రాన్సాక్షన్లను జరపాల్సి ఉంటుంది. దీనికి గాను అంతర్జాతీయ బ్యాంక్ ఖాతా సంఖ్య, కరస్పాండెంట్ పేరు, SWIFT కోడ్ వంటివి అవసరమవుతాయి. మీరు PayZapp, Paytm వంటి యాప్ల ద్వారా కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

ATM: ఏటీఎం యూజర్లకు అలర్ట్... ఇక ఈ ఛార్జీలు చెల్లించాల్సిందే

IRCTC Kerala Tour: అదిరిపోయే ఆఫర్... ఐదు వేలకే కేరళ టూర్

వెస్ట్రన్ యూనియన్ లేదా మనీగ్రామ్ వంటి టూల్స్ ద్వారా


ఈ రెండు మార్గాల ద్వారా మీరు ప్రపంచవ్యాప్తంగా డబ్బు పంపించే అవకాశం ఉంది. కానీ, మీరు మీ ట్రాన్సాక్షన్ వివరాలన్నింటినీ సంస్థకు అందించాల్సి ఉంటుంది. అయితే, మనీ ట్రాన్స్‌ఫర్ కావడానికి సాధారణంగా 1-5 రోజులు పడుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


ఎస్‌బీఐ కార్డ్ అధికారిక ఖాతాలోకి లాగిన్ అవ్వడం ద్వారా లేదా బ్యాంకుకు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే, మీరు తీసుకున్న మొత్తం అమౌంట్‌ను రెండు నుంచి ఆరు నెలల మధ్య తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలలకు మించితే మీరు నెలకు 1.7 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.

యాక్సిస్ బ్యాంక్


యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే మూడు నుంచి ఆరు నెలల మధ్య తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీరు కనీసం రూ.5 వేలను ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అయితే, మూడు నెలల వరకు మీరు తీసుకున్న అమౌంట్పై వడ్డీ వర్తించదు. ఒకవేళ మీరు తిరిగి చెల్లించడానికి ఆరు నెలలకు పైబడి సమయం తీసుకుంటే మాత్రం మీకు అడిషనల్ ఛార్జీ విధించబడుతుంది.

ఐసిఐసిఐ బ్యాంక్


ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ మొత్తాన్ని చెల్లించడానికి మీకు మూడు లేదా ఆరు నెలల వ్యవధి పడుతుంది. అయితే, మీరు తీసుకున్న మొత్తానికి వడ్డీ వసూలు చేయబడుతుంది. ఈ వడ్డీ కూడా బదిలీ చేయబడిన మొత్తంతో పాటు చెల్లించాల్సి ఉంటుంది.

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? అయితే ఈ లెక్క మర్చిపోవద్దు

Indane Gas Cylinder Booking: ఇండేన్ గ్యాస్ యూజర్లకు అలర్ట్... సిలిండర్ కావాలంటే ఈ నెంబర్‌కే కాల్ చేయాలి

హెచ్‌ఎస్‌బిసి


క్రెడిట్ కార్డు నుంచి మీరు డబ్బు తీసుకుంటే మూడు నెలల నుంచి 24 నెలల చెల్లింపు వ్యవధి ఉంటుంది. సంబంధిత వివరాల కోసం మీరు బ్యాంకుకు కాల్ చేయవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు లేదా బ్యాంకుకు SMS పంపవచ్చు.

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్


స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డు ద్వారా మీ అకౌంట్కు రూ.5 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే. మీరు తీసుకున్న డబ్బుకు మొదటి ఆరు నెలల్లో చెల్లిస్తే 0.99 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఒకవేళ మీరు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే, మీరు ట్రాన్స్‌ఫర్ చేసిన మొత్తంలో ప్రతి నెల కనీసం ఐదు శాతం చెల్లించవచ్చు.

కోటక్ మహీంద్రా బ్యాంక్


మీరు మీ కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి కనీసం రూ .2,500 నుంచి క్రెడిట్ లిమిట్లో 75 శాతం వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అన్ని క్రెడిట్ కార్డుల మాదిరిగానే, లాగిన్ అవ్వడం, కాల్ చేయడం, టెక్ట్స్ మెసేజ్ పంపడం ద్వారా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని పొందవచ్చు.

గుర్తుంచుకోవలసిన విషయాలు


క్రెడిట్ కార్డు నుంచి మీ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోండి.

మీ క్రెడిట్ పరిమితి తగ్గుతుంది


మీరు మీ క్రెడిట్ కార్డు నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మీ ప్రస్తుత క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ తగ్గుతుంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ పరిమితి లక్ష రూపాయలుగా ఉంటే అందులో నుండి మీరు రూ .75,000 బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే అప్పుడు మీ క్రెడిట్ లిమిట్ రూ .25,000 అవుతుంది.

మీ బకాయిలను వెంటనే చెల్లించండి


మీ బకాయిలను నిర్ణీత వ్యవధిలోగా చెల్లించాలి. నిర్ణీత వ్యవధిలో చేయడంలో విఫలమైతే, మీరు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది.

మీ కార్డును స్వైప్ చేయవద్దు


బ్యాలెన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించే వరకు ఇతర కొనుగోళ్లకు మీ కార్డును ఉపయోగించకండి. ఇది మీ కార్డు చెల్లింపులలో మీకు సహాయపడటమే కాకుండా, మీ క్రెడిట్ రేటింగ్‌ను కూడా మెరుగుపరుస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: November 3, 2020, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading