ఎస్ బ్యాంక్ సంక్షోభం దెబ్బతో రాష్ట్రాలకు ఆర్బీఐ కీలక సూచన

ఎస్ బ్యాంక్‌ పరిణామాలతో ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వరంగ బ్యాంకులకు తరలించాలని తమ శాఖలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్లు తెలిసింది. దీంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. రాష్ట్రాలు పునరాలోచన చేయాలని ఆర్‌బీఐ సూచించింది.

news18-telugu
Updated: March 13, 2020, 9:24 AM IST
ఎస్ బ్యాంక్ సంక్షోభం దెబ్బతో రాష్ట్రాలకు ఆర్బీఐ కీలక సూచన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వ సంస్థలు వెంటనే వెనక్కు తీసుకోవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. యెస్ బ్యాంకు ఘటనతో ఇప్పటికే పలు సంస్థలు ప్రైవేటు బ్యాంకుల నుంచి తమ నిధులను వెనక్కు తీసుకుంటున్నాయి. దీంతో ప్రైవేటు బ్యాంకులపై అభద్రతా భావం నెలకొనడంతో పాటు ఆర్థిక, బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రభావానికి కారణమవుతుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ఇటీవల ఎస్ బ్యాంక్‌ పరిణామాలతో ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వరంగ బ్యాంకులకు తరలించాలని తమ శాఖలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్లు తెలిసింది. దీంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. రాష్ట్రాలు పునరాలోచన చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
Published by: Krishna Adithya
First published: March 13, 2020, 8:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading