మీరు చెల్లించే నెలసరి ఈఎంఐలపై మోదీ గెలుపు ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా ?

మరోసారి కీలక వడ్డీ రేట్లు తగ్గే చాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మరోసారి గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లు భారీగా తగ్గనున్నాయి. ఈ చర్యతో వేతన జీవులు చెల్లించే ఈఎంఐలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

news18-telugu
Updated: May 27, 2019, 6:28 PM IST
మీరు చెల్లించే నెలసరి ఈఎంఐలపై మోదీ గెలుపు ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా ?
ప్రధాని నరేంద్ర మోదీ
news18-telugu
Updated: May 27, 2019, 6:28 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీ సీట్లు సాధించడంతో మోదీ ప్రభుత్వానికి సుస్థిరమైన పాలన అందించేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో జూన్ 6 ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించనుంది. దీంతో మరోసారి కీలక వడ్డీ రేట్లు తగ్గే చాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మరోసారి గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లు భారీగా తగ్గనున్నాయి. ఈ చర్యతో వేతన జీవులు చెల్లించే ఈఎంఐలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ లో సైతం మధ్యతరగతి జీవులను ఉద్దేశించి పలు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. అలాగే మార్కెట్లలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. అయితే కీలక వడ్డీ రేట్ల తగ్గింపులో 25 బేసిస్ పాయింట్లకు పరిమితం కాకుండా, వీలైతే 35 బేసిస్ పాయంట్ల వరకూ తగ్గించే దిశగా ఆర్బీఐ ఆలోచించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఆర్బీఐ ఇప్పటికే వరుసగా వడ్డీరేట్లను సవరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు సైతం రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించేందుకు ఇప్పటికే పలు బ్యాంకులు చర్యలు తీసుకున్నాయని సిండికేట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ ఇప్పటికిప్పుడు మరోసారి వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని, గతంలో తగ్గించిన వడ్డీరేట్ల ప్రభావంపై వేచిచూసే ధోరణి అవలంబించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు ఆర్థిక వేత్తలు మాత్రం వరుసగా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని, వృద్ధి మందగించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే కీలక వడ్డీరేట్ల తగ్గింపుతో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ తో గృహరుణాలు పొందే వారికి పండగేనని చెప్పుకోవచ్చు. అలాగే వాహనాల సేల్స్ కు సైతం వడ్డీ రేట్ల తగ్గింపు బూస్ట్ ఇస్తుందని ఆటో కంపెనీలు భావిస్తున్నాయి.

First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...