Investments: ఆర్థిక బిల్లు-2023కి(Finance bill 2023) కేంద్ర ప్రభుత్వం సవరణలను ప్రతిపాదిస్తూ, పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సవరణ ద్వారా కొన్నింటిపై పన్ను విధిస్తూ పెట్టుబడి మార్గాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు అనుగుణంగా కొన్ని నిబంధనలను మార్చారు. వాటి ప్రకారం.. ఈక్విటీ AUMలో 35% లోపు పెట్టుబడి పెట్టే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ఇక నుంచి దీర్ఘకాలిక మూలధన లాభాలను పొందడానికి అవకాశం ఉండదు. ఏప్రిల్ 1 నుంచి అటువంటి ఫండ్స్ నుంచి వచ్చే ఆదాయం స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తూ, పెట్టుబడిదారుల ట్యాక్స్ శ్లాబ్ రేటు ప్రకారం పన్ను విధించనున్నారు.
కేవలం డెట్ ఫండ్స్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ఫండ్స్ ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్, గోల్డ్ ఫండ్స్ (గోల్డ్ ఇటిఎఫ్‌ఎస్), హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీలో 35% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయని దేశీయ ఈక్విటీ ఫండ్స్(ఎఫ్‌ఓఎఫ్‌లు)పై కూడా ఒక వ్యక్తికి వర్తించే ట్యాక్స్ శ్లాబ్‌లో పన్ను విధించనున్నారు. ఈ రూల్స్ కారణంగా మరింత ఆకర్షణీయంగా మారనున్న ఐదు పెట్టుబడి మార్గాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* ఫిజికల్ గోల్డ్
ఫిజికల్ గోల్డ్ పెట్టుబడిదారులు లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ (LTCG) పన్ను ఇండెక్సేషన్‌తో 20% ప్రయోజనం పొందడం కొనసాగించే అవకాశం ఉంది. అయితే బంగారం కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తేనే, ఈ ప్రయోజనం వర్తించనుంది.
* ఫిక్స్‌డ్ డిపాజిట్
కొత్త పన్ను నిబంధన కారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లను డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో సమానంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. వివిధ రుణ సాధనాల మధ్య ఆర్బిట్రేజీని తొలగించడంతో కొత్త పన్ను నిబంధన అనేది బ్యాంక్ ఎఫ్‌డీలకు బూస్ట్‌లా పనిచేయవచ్చని నిపుణులు అంటున్నారు.
* సావరిన్ గోల్డ్ బాండ్స్
కొత్త ట్యాక్స్ రూల్స్ గోల్డ్ ఈటీఎఫ్‌లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్ మరింత ఆకర్షణీయంగా మారవచ్చు. దీంతో కస్టమర్లు ఎక్కువ డబ్బు సావరిన్ గోల్డ్ బాండ్ల వైపు మళ్లించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
* కార్పొరేట్ బాండ్స్
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కార్పొరేట్ బాండ్స్‌కు డిమాండ్ ఉంటుంది. కొత్త పన్ను నిబంధనల కారణంగా వీటిలో ఇన్వెస్ట్ చేసేవారు మంచి ప్రయోజనం పొందవచ్చు. మూలధనం సమర్చుకోవడం కోసం, లోన్ రీఫైనాన్సింగ్ కోసం కార్పొరేషన్స్ జారీ చేసే లోన్ డాక్యుమెంట్లను కార్పొరేట్ బాండ్స్ అంటారు. వీటిపై వడ్డీ ఫెడరల్, స్టేట్, స్థానిక పన్నులకు లోబడి ఉంటుంది.
PAN Aadhaar Link: గుడ్ న్యూస్... పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం
* ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
డెట్ ఫండ్స్‌పై LTCG (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) ప్రయోజనాలను తీసివేయడం వల్ల ఈక్విటీ/గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్ వైపు ఫండ్స్ తరలింపు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మార్పు తక్కువ వ్యవధిలో (3 సంవత్సరాల కంటే తక్కువ) డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన కార్పొరేట్స్‌ను ప్రభావితం చేయదు.
ఫైనాన్స్ బిల్లులోని సవరణ వల్ల కస్టమర్లు పెట్టుబడి పెట్టే విధానంలో గణనీయమైన నిర్మాణాత్మక మార్పులు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ఆసక్తిని పొందాలంటే, అది ఇప్పుడు అదనంగా రిస్క్-సర్దుబాటు చేసే రాబడిని జోడించే విధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Finance, Fixed deposits, Mutual Funds