హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vaya Vandana Yojana: కేంద్రం అద్భుత స్కీమ్.. చేరితే ఏటా మీ అకౌంట్‌లోకి లక్ష రూపాయలు!

Vaya Vandana Yojana: కేంద్రం అద్భుత స్కీమ్.. చేరితే ఏటా మీ అకౌంట్‌లోకి లక్ష రూపాయలు!

Vaya Vandana Yojana: కేంద్రం అద్భుత స్కీమ్.. చేరితే ఏటా మీ అకౌంట్‌లోకి లక్ష రూపాయలు!

Vaya Vandana Yojana: కేంద్రం అద్భుత స్కీమ్.. చేరితే ఏటా మీ అకౌంట్‌లోకి లక్ష రూపాయలు!

Pension | మీరు రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరితే ఏటా రూ.లక్ష పొందొచ్చు. ఈ స్కీమ్ పరిమిత కాలం వరకే ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Saving Schemes | కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన మంత్రి వయ వందన యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ (Schemes) పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. 2023 మార్చి 31 వరకు ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండదు. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో (Budget 2023 - 24 ) ఈ స్కీమ్ గడువు పొడిగించే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. ప్రదాన్ మంత్రి వయన వందన యోజన పథకం కేవలం 60 ఏళ్ల వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2020లో ప్రధాని మోదీ ఈ స్కీమ్‌ను ఆవిష్కరించారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల సీనియర్ సిటిజన్స్‌కు 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. గరిష్టంగా ఈ స్కీమ్ కింద రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

రూ.70 వేలలోపు ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 7 బైక్స్ ఇవే!

అంటే మీరు రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.4 శాతం రేటు ప్రకారం చూస్తే.. మీకు ఏడాదికి రూ. 1.1 లక్షల వడ్డీ ఆదాయం వస్తుంది. ఈ పాలసీ టర్మ్ పదేళ్లు . అంటే ప్రతి ఏటా మీకు రూ. 1.1 లక్షలు వస్తూనే ఉంటాయి. ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు కనీసం రూ. 1,56,658 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

హైస్పీడ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది.. ఒక్క రూపాయి కట్టకుండానే బుక్ చేసుకోండిలా!

ఎల్ఐసీ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల కనీసం నెలకు రూ. 1,000 పెన్షన్ పొందొచ్చు. ఏడాదికి రూ. 12 వేలు వస్తాయని చెప్పుకోవచ్చు. అదే గరిష్టంగా చూస్తే.. నెలకు రూ. 9,250 పెన్షన్ వస్తుంది. ఏడాదికి రూ. 1.1 లక్షలు లభిస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ ఆదాయం కూడా మారుతుందని గుర్తించుకోవాలి. పెన్షన్ మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పొందొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవాలి. స్కీమ్ గడువు ముగిసిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్నితిరిగి వెనక్కి చెల్లిస్తారు. అందువల్ల రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారు స్థిర ఆదాయం కోరుకుంటూ ఉంటే.. ఈ స్కీమ్‌లో చేరొచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు.

First published:

Tags: LIC, Money, Pensions, Pm modi

ఉత్తమ కథలు