Dearness Allowance | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించనుందా? వెలువడుతున్న మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. మోదీ సర్కార్ ఈసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA) 4 శాతం మేర పెరగొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు (Pension) ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతంగా ఉంది. డీఏ ఒకవేళ 4 శాతం పెరిగితే.. అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల వేతనం కూడా పైకి కదలనుంది.
ప్రతి నెలా లేబర్ బ్యూరో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (సీసీఐ ఐడబ్ల్యూ) ప్రకారం డీఏను లెక్కిస్తారు. కార్మిక శాఖకు చెందిన ఒక అనుబంధ విభాగమే లేబర్ బ్యూరో. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా పీటీఐతో మాట్లాడుతూ.. డిసెంబర్ నెలకు సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ జనవరి 31న విడుదల అయ్యిందని తెలిపారు. దీని ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 4.23 శాతం మేర పెరగాల్సి ఉందని తెలిపారు. అయితే కేంద్రం పాయింట్ తర్వాత ఉన్న నెంబర్లను పరిగణలోకి తీసుకోదు. అందువల్ల డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని వివరించారు. అందువల్ల డీఏ అనేది 42 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
రూ.1,300 పడిపోయిన బంగారం ధర.. రూ.3,600 పతనమైన వెండి! లేటెస్ట్ రేట్లు ఇలా
అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్‌పెండేచర్ డిపార్ట్‌మెంట్ డీఏ పెంపునకు సంబంధించి ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తుందని, దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. డీఏ పెంపు అనేది 2023 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం కోటికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం డీఏ పొందుతున్నారు. చివరిగా డీఏ పెంపు అనేది 2022 సెప్టెంబర్ 28న జరిగింది. ఈ పెంపు 2022 జూలై 1 నుంచి వర్తిస్తుంది.
కారు కొంటే రూ.72,000 డిస్కౌంట్.. మారుతీ, టాటా, హోండా కార్లపై ఆఫర్ల వర్షం!
కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రతి సంవత్సరం రెండు సార్లు పెంచుతుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి డీఏ పెంపు ఉంటుంది. అలాగే తర్వాత జూలై నుంచి డిసెంబర్ వరకు కాలానికి మరోసారి డీఏ పెంపు ఉంటుంది. ఇలా ఏడాదిలో రెండు సార్లు డీఏ పెంపు వర్తిస్తుంది. డీఏ పెంపు ఎప్పుడు జరిగినా జనవరి 1 నుంచి లేదంటే జూలై 1 నుంచి పెంపు వర్తిస్తుంది. అయితే కరోనా టైమ్‌లో మాత్రం కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల పాటు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, DA Hike, Dearness allowance, Employees, Salary, Salary Hike