MODI GOVT LAUNCHES NEW PLAN FOR WELFARE OF SMALL BUSINESSES OPEN NETWORK DIGITAL COMMERCE TO BE CHECKED BY AMAZON FLIPKART GH VB
Central Government New Plan: చిన్న వ్యాపారులకు తీపి కబురు.. వారి సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కొత్త ప్లాన్..
Nandan Nilekani (File)
చిన్న వ్యాపారుల కోసం ఓపెన్ టెక్నాలజీ నెట్వర్క్ అనే కొత్త ప్లాట్‌ఫారమ్ త్వరలో అందుబాటులోకి రానుంది. పెద్ద ఈ-కామర్స్ కంపెనీలతో నష్టపోతున్న చిన్న వ్యాపారులకు ఈ నెట్వర్క్ ఎంతో మేలు చేయనుంది.
చిన్న వ్యాపారుల కోసం ఓపెన్ టెక్నాలజీ నెట్వర్క్(Open Technology Network) అనే కొత్త ప్లాట్‌ఫారమ్ త్వరలో అందుబాటులోకి రానుంది. పెద్ద ఈ-కామర్స్ కంపెనీలతో(E Commerce Companies) నష్టపోతున్న చిన్న వ్యాపారులకు ఈ నెట్వర్క్(Network) ఎంతో మేలు చేయనుంది. ఇక్కడ వ్యాపారులు, వినియోగదారులు ప్రతిదీ కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. ఉచితంగా అందుబాటులో ఉండే ఈ ఆన్లైన్ సిస్టమ్‌ను(Online System) ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని ప్రతిపాదించారు. ఇండియాలో ఆధార్(Aadhar) రూపకల్పనకు కృషి చేసిన ఆయన.. ఇప్పుడు చిన్న వ్యాపారుల సంక్షేమం కోసం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)ను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలపై భారత ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది సభ్యుల సలహా మండలిలో నీలేకని ఒకరు.
దేశంలోని ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో 80 శాతం వాటా స్వాధీనం చేసుకున్న పెద్ద ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌లను సవాలు చేసే సామర్థ్యం ఈ నెట్‌వర్క్‌కు ఉంది. ‘డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైంది. డిజిటల్ కామర్స్ అనే కొత్త హై-గ్రోత్ ఏరియాలో పాల్గొనడానికి లక్షల కొద్దీ చిన్న విక్రేతలకు సులభమైన మార్గాన్ని ఈ నెట్వర్క్ చూపించగలదు’ అని నీలేకని ఇటీవల చెప్పారు.
కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ టాస్క్‌ను పూర్తి చేయడానికి నీలేకని సరైన వ్యక్తి తెలిపారు పాలో ఆల్టో బేస్డ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ జనరల్ క్యాటలిస్ట్ మేనేజింగ్ పార్ట్నర్ హేమంత్ తనేజా. ‘ఆర్థిక వ్యవస్థలో ఏయే భాగాలు డిజిటల్ పబ్లిక్ గూడ్స్‌గా ఉండాలి, పెట్టుబడిదారీ విధానంలో ఏయే భాగాలు ఉండాలి అనే దానిపై నీలేకనికి స్పష్టత ఉందన్నారు. మార్పు తెచ్చే వ్యవస్థలను ఆయన ఏర్పాటు చేయగలరని తనేజా చెప్పారు.
* ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే ఏంటి?
ONDC అనేది ఓపెన్ ప్రోటోకాల్‌పై ఆధారపడిన ఓపెన్ టెక్నాలజీ నెట్వర్క్. మొబిలిటీ, గ్రాసరీ, ఫుడ్ ఆర్డర్, డెలివరీ, హోటల్ బుకింగ్, ట్రావెల్ వంటి విభాగాల్లో లోకల్ కామర్స్‌కు ఈ నెట్వర్క్ యాక్సెస్ కల్పిస్తుంది. ఏదైనా నెట్వర్క్ ఎనేబుల్డ్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు. కొత్త అవకాశాలను సృష్టించడం, డిజిటల్ గుత్తాధిపత్యాన్ని అరికట్టడంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వడం, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలోకి రావడానికి వారికి సహాయపడటం వంటివి ఈ ప్లాట్‌ఫారమ్ లక్ష్యాలు.
ఈ నెట్వర్క్ ఏర్పాటుకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) విభాగం చొరవ తీసుకుంది. ఏదైనా నిర్దిష్ట ప్లాట్‌ఫారమ్‌తో సంబంధం లేకుండా ఓపెన్ స్పెసిఫికేషన్స్, ఓపెన్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఉపయోగించి ఓపెన్ సోర్స్డ్ మెథడాలజీపై అభివృద్ధి చేసిన ఓపెన్ నెట్‌వర్క్‌లను ప్రోత్సహించడం దీని లక్ష్యం. దీని ద్వారా మొత్తం వాల్యూ చైన్‌ను డిజిటలైజ్ చేయడం, కార్యకలాపాలను ప్రామాణికం చేయడం, సరఫరాదారులను చేర్చేలా ప్రోత్సహించడం, లాజిస్టిక్స్‌లో సామర్థ్యాలను పొందడం, వినియోగదారులకు విలువను పెంచడం.. వంటివి చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి నెట్వర్క్ రూపొందించడం ఇదే మొదటిసారి. ఈ కొత్త నెట్వర్క్ త్వరలో అందుబాటులోకి రానుంది. ముందు ట్రేడ్ బేస్ ఉన్న ఢిల్లీ, బెంగళూరు, కోయంబత్తూర్, భోపాల్, షిల్లాంగ్ వంటి ఐదు నగరాలను ఇందుకు ఎంచుకున్నట్లు DPIIT అదనపు కార్యదర్శి అనిల్ అగర్వాల్ వెల్లడించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.