PM Kisan Scheme | కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. మోదీ (Modi) సర్కార్ తాజాగా ముడి జనపనార కనీస మద్దతు ధరను (Money) పెంచేసింది. రూ. 300 వరకు ధర పెరిగింది. దీంతో క్వింటాకు ముడి జనపనార ధర రూ. 5050కు చేరింది. 2023- 24 సీజన్‌కు సంబంధించి ఈ రేటు వర్తిస్తుందని గుర్తించుకోవాలి.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు కనసీ మద్దతు ధరను పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ముడి జనపనార కనీస మద్దతు ధర ఇప్పుడు క్వింటాకు రూ. 5050 గా నిర్ణయించారు.
పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ భారీ ఊరట.. కీలక నిర్ణయం!
అలాగే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) అలాగే కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వపు నోడల్ ఏజెన్సీగా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటుంది. లాభనష్టాలను ఇది భరిస్తుంది. కేంద్రం ఈ నోడల్ ఏజెన్సీకి తోడ్పాటు అందిస్తుంది. కనీస మద్దతు ధర పెంపు వల్ల రైతులకు గతంలో కన్నా ఇకపై పంటకు ఎక్కువ రేటు వస్తుందని చెప్పుకోవచ్చు.
గ్యాస్ సిలిండర్ వాడే వారికి మోదీ భారీ శుభవార్త.. ఎల్‌పీజీ సబ్సిడీపై కీలక ప్రకటన!
మరోవైపు క్యాబినెట్ మీటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం మేర పెంచేసింది. దీని వల్ల ఉద్యోగులకు భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. వేతనాలు పెరగనున్నాయి. అలాగే పెన్షనర్లకు కూడా బెనిఫిట్ ఉంది. డియర్‌నెస్ రిలీఫ్ కూడా పైకి కదిలింది. తాజా పెంపుతో డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతానికి చేరింది. ఇది వరకు డీఏ 38 శాతంగా ఉండేది.
డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ. 12,800 కోట్లకు పైగా భారం పడనుంది. ఈ డీఏ పెంపు నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. దీని వల్ల దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చివరిగా 2022 సెప్టెంబర్ నెలలో డీఏను పెంచింది. అప్పుడు డీఏ 4 శాతం పెరుగుదలతో 38 శాతానికి చేరింది. కాగా ప్రభుత్వం ఏటా డీఏను రెండు సార్లు సవరిస్తూ వస్తుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి, జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి డీఏ పెంపు ఉంటుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డియర్‌నెస్ అలవెన్స్ సవరణ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Money, MSP, PM KISAN, PM Kisan Scheme