హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ration Card: కేంద్రం గుడ్ న్యూస్.. మరో 3 నెలలు ఉచితంగానే బియ్యం!

Ration Card: కేంద్రం గుడ్ న్యూస్.. మరో 3 నెలలు ఉచితంగానే బియ్యం!

మరో 3 నెలలు ఉచిత బియ్యం

మరో 3 నెలలు ఉచిత బియ్యం

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని తాజాగా మరో మూడు నెలలపాటు అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రానున్న పండుగ సీజన్‌ నేపథ్యంలో పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కరోనా కాలంలో ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) పథకాన్ని తీసుకొచ్చింది. అర్హత ఉన్న లబ్ధిదారుడికీ అదనంగా 5 కిలోల బియ్యం అందజేసింది. ఇప్పటికే పలు దఫాలు పొడిగిస్తూ వచ్చిన ఈ పథకాన్ని తాజాగా మరో మూడు నెలలపాటు అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రానున్న పండుగ సీజన్‌ నేపథ్యంలో పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో జాతీయ ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడనుంది.

PM-GKAY అమలు ఇలా..

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రారంభించారు. 2020 మార్చిలో ప్రారంభమైన పథకాన్ని మొదట 2020 ఏప్రిల్, మే, జూన్ వరకు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వివిధ కారణాలతో 2020 నవంబర్ వరకు పొడిగించారు. 2021 ఏప్రిల్‌లో కోవిడ్-19 కేసులు పెరగడంతో.. ఈ పథకాన్ని 2021 మే, జూన్ నెలలకు మళ్లీ ప్రవేశపెట్టారు.

7 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం ధర.. పతనమైన వెండి!

అనంతరం 2021 జులై నుంచి 2021 నవంబర్ వరకు మరో ఐదు నెలల పాటు పొడిగించారు. ఐదో దశలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చి వరకు అమలవుతుందని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కూడా మార్చి 26న కేంద్రం ఈ పథకాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు అమలు చేస్తున్నట్లు పేర్కొని రూ.80,000 కోట్ల నిధులను కేటాయించింది.

కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్? వొడాఫోన్ ఐడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్?

లబ్ధిదారులు పొందే ప్రయోజనాలు

ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడు జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద లభిస్తున్న రేషన్‌ కోటాతో పాటు అదనంగా ఉచిత రేషన్‌ పొందుతారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ప్రతి వ్యక్తికి నెలకు అదనంగా 5 కిలోల ఉచిత బియ్యం అందుతాయి. దేశంలోని దాదాపు 5 లక్షల రేషన్ షాపుల నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్(ONORC) పథకం కింద ఏ వలస కార్మికుడు లేదా లబ్ధిదారుడు అయినా పోర్టబిలిటీ ద్వారా ఉచిత రేషన్ ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటివరకు 61 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు జరిగాయి. ఇళ్లకు దూరంగా ఉన్న లబ్ధిదారులు కూడా తాము ఉండే ప్రాంతంలో ఉచిత రేషన్‌ అందుకున్నారు.

First published:

Tags: Free Ration, Free ration in telangana, Ration card

ఉత్తమ కథలు