కరోనా దెబ్బకు మోదీ సర్కారు భారీ అప్పు.. ఎంతో తెలుసా..?

ప్రధాని మోదీ (Image: DDNews)

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1తో ఆరంభం కానున్న 2020-21 తొలి త్రైమాసికంలో రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది.

  • Share this:
    అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళుతోందన్న భయం.. దానికి తోడు మహమ్మారి కరోనా దాడి.. వెరసి ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఉత్పత్తి రంగం భారీగా నష్టపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతున్నాయి. ఇండియా విషయానికి వచ్చే సరికి లాక్ డౌన్ వల్ల దేశం మొత్తం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1తో ఆరంభం కానున్న 2020-21 తొలి త్రైమాసికంలో రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. కరోనా వైరస్‌ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు అప్పు తీసుకోనుంది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి తెలిపారు.

    కాగా, కొత్త ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఏడాది ఇది రూ.7.1 లక్షల కోట్లు. అటు.. నికర రుణాలు 2020-21 ఆర్థిక సంవత్సారానికి రూ.5.36 లక్షల కోట్లు ఉంటాయని ఆమె వెల్లడించారు. 2019-20లో ఇది రూ.4.99 లక్షల కోట్లుగా ఉంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: