గుడ్ న్యూస్.. చిన్న వ్యాపారులకు కోటి రూపాయల లోన్

ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించేందు చిన్న వ్యాపారులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. కంపెనీ టర్నోవర్, అమ్మకాలు, కొలేటరల్ ఆధారంగా లోన్ ఎంత ఇవ్వాలనేది బ్యాంకులు నిర్ణయిస్తారు.

news18-telugu
Updated: September 27, 2019, 5:12 PM IST
గుడ్ న్యూస్.. చిన్న వ్యాపారులకు కోటి రూపాయల లోన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్న వ్యాపారులకు ఊతం ఇచ్చేలా మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం గత ఏడాది '59 నిమిషాల లోన్' పథకాన్ని తెచ్చిన మోదీ సర్కార్... ఈసారి చిన్న వ్యాపారుల కోసం జీఎస్టీ ఎక్స్‌ప్రెస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. CNBC AWAAZకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 6 నెలలుగా క్రమం తప్పకుండా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే వ్యాపారులకు కోటి రూపాయల వరకు లోన్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ పథకానికి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది.

జీఎస్టీ ఎక్స్‌ప్రెస్ లోన్ పథకం అమల్లోకి వస్తే జీఎస్టీని సక్రమంగా చెల్లించే వ్యాపారులకు బ్యాంకులు ఇకపై రెడ్ కార్పెట్ పరుస్తాయి. ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ లేకుండానే కోటి రూపాయల వరకు లోన్ మంజూరు చేస్తారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించేందు చిన్న వ్యాపారులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. కంపెనీ టర్నోవర్, అమ్మకాలు, కొలేటరల్ ఆధారంగా లోన్ ఎంత ఇవ్వాలనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల నుంచి కోటి వరకు లోన్ అందిస్తారు. కేబినెట్ ఆమోదం తర్వాత జీఎస్టీ ఎక్స్‌ప్రెస్ స్కీమ్ అమల్లోకి వచ్చే అవకాశముంది.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>