news18-telugu
Updated: November 3, 2020, 5:33 PM IST
Business Loan: వ్యాపారానికి అప్పు కావాలా? మోదీ ప్రభుత్వ పథకానికి నవంబర్ 30 లోగా అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ మహమ్మారి ద్వారా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్-ECLGS కూడా ఒకటి. ఈ స్కీమ్ గడువు ముగిసిపోవడంతో నవంబర్ 30 వరకు పొడిగిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్-ECLGS ద్వారా రూ.3 లక్షల కోట్ల అప్పులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 60.67 లక్షల మందికి రూ.2.03 లక్షల కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.48 లక్షల కోట్లు వారి అకౌంట్లలో జమ చేసింది. అయితే మోదీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం రూ.3 లక్షల కోట్లు. ఆ లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో గడువును మరో నెల పొడిగించింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో అనేక రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆయా రంగాల్లో వ్యాపారాలు చేసుకునేవారికి నగదు అవసరం ఏర్పడుతుంది. అలాంటివారు తమ వ్యాపారం కోసం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేయొచ్చు.
EPFO: వాట్సప్‌లో ఈపీఎఫ్ఓ హెల్ప్‌లైన్... హైదరాబాద్, విజయవాడ నెంబర్స్ ఇవేJan Dhan account: జన్ ధన్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్
ఈ ఏడాది మేలో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థికంగా ఊతం ఇచ్చేందుకు ష్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తామని ప్రకటించింది మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రుణాల్లో 20 శాతం వరకు ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. మొదట్లో ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన ఈ స్కీమ్‌ను ఆ తర్వాత అన్ని వ్యాపారాలకు విస్తరించింది. అంతేకాదు... వ్యాపార అవసరాల కోసం ఎవరైనా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్ర రుణాలు తీసుకున్నవారు కూడా అదనంగా ఈ లోన్ తీసుకోవచ్చు. నవంబర్ 30 వరకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు రుణాలు తీసుకోనివారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర తీసుకునే రుణాలకు 9.25 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర రుణాలు తీసుకుంటే 14 శాతం వడ్డీ చెల్లించాలి. ఏడాది మారటోరియంతో కలిపి నాలుగేళ్ల వరకు గడువు ఎంచుకోవచ్చు.
Gold: ఒక్క రూపాయికే బంగారం... మీరూ కొనండి ఇలా
SBI Debit Card: ఏటీఎం కార్డు పోయిందా? సింపుల్‌గా బ్లాక్ చేయండిలా
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు చెందిన సంస్థ అయిన ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ స్కీమ్‌ను డిసెంబర్ చివరి వరకు అంటే రెండు నెలలు పొడిగించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇప్పటికే లేఖ రాసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక నెల మాత్రమే గడువు పొడిగించింది.
Published by:
Santhosh Kumar S
First published:
November 3, 2020, 5:33 PM IST