హోమ్ /వార్తలు /బిజినెస్ /

UPI పేమెంట్స్ పై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. కీలక ప్రకటన విడుదల

UPI పేమెంట్స్ పై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. కీలక ప్రకటన విడుదల

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

యూపీఐ (UPI) లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు విధించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Delhi | Hyderabad

  యూపీఐ (UPI) లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు విధించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance) గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అంశంపై క్లారిటీ ఇచ్చింది. యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది కేంద్రం. ఈ మేరకు ఆదివారం రాత్రి అధికారిక ప్రకటన విడుదలైంది. UPI సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని కేంద్రం (Central Government) ఈ ప్రకనటలో స్పష్టం చేసింది. ఈ సేవలపై ఛార్జీలు విధించేందుకు ఎలాంటి పరిశీలన విడుదల చేయలేదని ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్రం ప్రకటనతో యూపీఐ వినియోగదారులకు (UPI) ఊరట లభించినట్లైంది. అయితే.. ఇందుకు సంబంధించి నిర్వహణ ఛార్జీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

  యూపీఐ ద్వారా చెల్లింపులపై ఛార్జీలు విధించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరైతే UPI సేవను అందిస్తున్నారో , అతను తన ఖర్చును కవర్ చేయడానికి వేరే మార్గాన్ని పరిగణించాలని సూచించింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

  Home Loan EMIs Set To Rise: పెరగనున్న హోమ్ లోన్ EMIలు.. లోన్ భారాన్ని తగ్గించుకునే నాలుగు వ్యూహాలు ఇవే..!

  డిజిటల్ చెల్లింపుల వల్ల ఆర్థిక ప్రయోజనాల ఉంటాయని వెల్లడించింది. ప్రజలకు బ్యాకింగ్ చాలా సులభం అయ్యిందని తెలిపింది. అందుకే ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలన్న సన్నాహాలు చేయడం లేదన్నారు. గతేడాది డిజిటల్ పేమెంట్స్ కోసం ఆర్థిక సహాయాన్ని అందించిందన్నారు. డిజిటల్ పేమెంట్స్, చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లను ప్రజలకు మరింతగా దగ్గర చేసేందుకు ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రకటించిందని వెల్లడించింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Central Government, Finance minister, Rbi, UPI

  ఉత్తమ కథలు