Farmers | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. రబీ (Rabi) పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023- 24 మార్కెటింగ్ సీజన్‌కు ఈ కొత్త రేట్లు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా కనీస మద్దతు ధర పెంపు విషయాన్ని ప్రకటించారు.
పంటలపై తాజా కనీస మద్దతు ధర పెంపును గమనిస్తే.. గోధుమ ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ. 110 మేర పెరిగింది. దీంతో గోధుల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2125కు చేరింది. ఇదివరకు ఇది రూ. 2015గా ఉండేది. అలాగే బార్లీ మద్దతు ధర విషయానికి వస్తే.. దీని రేటు కూడా రూ. 100 మేర పైకి చేరింది. క్వింటాల్‌కు బార్లీ కనీస మద్దతు ధర రూ. 1735గా ఉంది. ఇదివరకు ఈ రేటు రూ. 1635గా ఉండేది.
సామాన్యులకు కేంద్రం షాక్? దీపావళి తర్వాత పెరగనున్న వంట నూనె ధరలు!
అలాగే కంది పప్పు కనీస మద్దతు ధర కూడా పెరిగింది. రూ. 105 పైకి చేరింది. దీంతో కంది పప్పు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5230 నుంచి రూ. 5335కు చేరింది. అలాగే సన్‌ఫ్లవర్ కనీస మద్దతు ధర రూ. 209 పైకి చేరింది. ఇప్పుడు దీని కనీస మద్దతు ధర రూ. 5650గా ఉంది. ఇదివరకు దీని రేటు రూ. 5441. అలాగే ఆవాల మద్దతు ధర రూ. 400 పైకి చేరింది. దీంతో దీని కనీస మద్దతు ధర రూ. 5450కు ఎగసింది. ఇదివరకు మద్దతు ధర రూ. 5050గా ఉండేది.
రైతులకు శుభవార్త.. మరో కొత్త స్కీమ్ తెచ్చిన మోదీ, లాభాలివే!
కాగా అన్నింటి కన్నా మసూర్ దాల్ కనీస మద్దతు ధర ఎక్కువగా పెరిగింది. రూ. 500 పైకి చేరింది. దీంతో మసూర్ దాల్ మద్దతు ధర రూ. 5500 నుంచి రూ. 6 వేలకు ఎగసింది. ఎంఎస్పీ కమిటీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రబీ పంటకు సంబంధించి రేట్లు పెంచాలనే ప్రతిపాదనలు అందాయి. దీంతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కనీస మద్దతు ధర పెంచాలని కేంద్ర కేబినెట్‌కు సిఫార్సు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు కేంద్ర కేబినెట్ రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు వెల్లడించింది. మోదీ సర్కార్ తాజాగా కనీస మద్దతు ధర పెంచడం వల్ల రైతులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.