Home /News /business /

MOBILE RECHARGE FROM PAYTM BECAME COSTLIER AS PAYTM STARTS TAKING SURCHARGE FROM CUSTOMERS NS

Paytm Surcharge: మీరు పేటీఎం వాడుతుంటారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్.. ఇక నుంచి ఆ ఛార్జీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు ప్రముఖ పేమెంట్స్ యాప్ paytm ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్. ఎందుకంటే paytm ఇటీవల రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించింది.

    మీరు ప్రముఖ పేమెంట్స్ యాప్ paytm ద్వారా మొబైల్ రీఛార్జ్ (Recharge) చేసుకుంటారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్. ఎందుకంటే paytm ఇటీవల రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించింది. ఈ రుసుము రూ. 1 నుండి రూ. 6 వరకు ఉంటుంది. సర్‌ఛార్జ్ ఎంత అనేది మీరు చేసుకునే రీఛార్జ్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఛార్జీలు అన్ని Paytm మొబైల్ రీఛార్జ్‌లపై వర్తించనుంది. గతేడాది.. ఫోన్‌పే తన కస్టమర్‌లకు రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్‌ని అమలు చేసిని విషయం తెలిసిందే. ఈ విషయంపై ట్విట్టర్ లో చాలా మంది వినియోగదారులు తమ పోస్టుల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొబైల్ రీఛార్జ్‌లపై పేటీఎం సర్‌ఛార్జ్‌ను వసూలు చేయడం ప్రారంభించిందని వారు తమ పోస్ట్ లలో పేర్కొన్నారు. మార్చి నుంచే పేటీఎం ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ఛార్జీలు పడుతున్నాయి. ప్రస్తుతం.. ఈ రుసుము రూ. 100 కంటే ఎక్కువ రీఛార్జ్‌పై కనిపిస్తోంది. 2019 సంవత్సరంలో, Paytm దాని వినియోగదారుల నుండి సర్‌ఛార్జ్ రుసుములను వసూలు చేయదని చెప్పింది.

    కానీ ఇప్పుడు చాలా మంది వినియోగదారులపై ఈ భారం వేస్తోంది పేటీఎం. PhonePe కూడా మొబైల్ రీఛార్జ్‌పై తన వినియోగదారులకు ఛార్జీ విధిస్తోంది. రూ.50 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే ఈ రుసుము విధించబడుతోంది. దీన్ని చిన్న స్థాయిలో తీసుకొస్తున్నామని, దీని వల్ల వినియోగదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదని కంపెనీ తెలిపింది.
    UPI Payment: మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా ఎక్కువగా చెల్లింపులు చేస్తుంటారా? అయితే, ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి





    ఇదిలా ఉంటే.. 2019లో పేటీఎం పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ను నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. తమ ప్లాట్‌ఫామ్‌లో కార్డ్స్, యూపీఐ, వాలెట్ ఏ పద్ధతిలో ట్రాన్సాక్షన్ చేసినా ఎలాంటి కన్వినెన్స్, ట్రాన్సాక్షన్ ఫీజ్ వసూలు చేయబోమని పేటీఎం ఆ ట్వీట్‌లో వెల్లడించింది. అయితే.. గతంలో తాను చేసిన ప్రకటన నుంచి ఇప్పుడు వెనక్కి తగ్గడంపై నెటిజన్లు పేటీఎంపై ఫైర్ అవుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Paytm, Recharge

    తదుపరి వార్తలు