news18-telugu
Updated: November 13, 2020, 7:23 PM IST
MobiKwik Blue American Express Card
ప్రముఖ డిజిటల్ లావాదేవీల చెల్లింపు సంస్థ మొబిక్విక్.. అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు నెట్వర్క్(అమెక్స్)తో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం ఈ రెండు సంస్థలు కలిసి స్థిరమైన క్రెడిట్ లిమిట్ తో తొలి ప్రీపేయిడ్ చెల్లింపులను లాంచ్ చేశాయి. ఈ హోం గ్రోన్ ఫిన్టెక్ కంపెనీ భారత్ లో కార్డులను జారీచేసిన బ్యాంకేతర సంస్థగా గుర్తింపుతెచ్చుకుంది. ఈ విషయాన్ని మొబిక్విక్ సంస్థే స్వయంగా ప్రకటించింది. మొబిక్విక్ తన ఆర్థిక సేవలను ఫిన్టెక్ ప్లేయర్ గా విశ్వవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. మొబిక్విక్ అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు వినియోగదారుల వాలెట్ తో అనుసంధానించబడుతుంది. కస్టమర్ వారి ప్రీపెయిడ్ కార్డుపై లక్ష రూపాయల వరకు తక్షణ క్రెడిట్ ను పొందుతారు. ఇందుకు సంబంధించి మొబిక్విక్ రాతపూర్వకంగా ఇస్తుంది. మొబిక్విక్ బ్లూ కార్డును ప్రారంభించడం వల్ల స్టాక్ పిన్టెక్ ప్లాట్ ఫామ్ గా మారడమే కాకుండా, డిజిటల్ ఇండియాలో భారతీయుల ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో బట్వాడా చేసే మా ప్రయాణంలో ఇది మైలు రాయి అవుతుందని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉపాసన టాకు అన్నారు.
కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..వినియోగదారులు తమ ఫోన్ లోని మొబిక్విక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఉంటే యాప్ ను అప్డేట్ చేసుకోవాలి. రిజిస్టర్ మొబైల్ నంబరు, OTP సాయంతో యాప్ లోకి లాగిన్ అవ్వాలి. అమెరికన్ ఎక్స్ ప్రెస్ లోగో.. హోమ్ స్క్రీన్ లోని రైట్ కార్నర్ లో ఉంటుంది. కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే వినియోగదారులు ఆ లోగోపై క్లిక్ చేయాలి. అనంతరం "మొబిక్విక్ బ్లూ కార్డు జారీ ప్రక్రియకు కొన్ని సెకన్ల సమయం పడుతుంది" అని ఓ కంపెనీ ఓ ప్రకటన ఇస్తుంది.
ఈ కార్డు ద్వారా క్రెడిట్ పరిమితిలో రూ.10,000 కొనుగోలు చేస్తే 1 శాతం సూపర్ క్యాష్, దీపావళి షాపింగ్ లో అయితే 20 శాతం పొదుపు రూపంలో విలువను అందిస్తుందని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు చెప్పారు. అమెరికన్ ఎక్స్ ప్రెస్ ఇండియా, దక్షిణాసియా గ్లోబల్ నెట్వర్క్ సర్వీసెస్ అధిపతి దివ్య జైన్ మాట్లాడుతూ.. వ్యూహాత్మక దృష్టితో అనుంసంధిచామని, బ్లూ కార్డు కోసం మొబిక్విక్ తో దీర్ఘకాల సంబంధాన్ని బలోపేతం చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. అర్థవంతమైన రీతిలో డిజిటల్ ఫస్ట్ ఎజెండా ఉందని చెప్పారు.
ప్రారంభించిన నెలలనే దాదాపు 2 లక్షల మొబిక్విక్ అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు జారీ చేశామని ఫిన్టెక్ సంస్థ తెలిపింది.
మొబిక్విక్ బ్లూ కార్డు ప్రారంభానికి ముందే అంచనాలను అధిగమించిందని ప్రారంభ ఫలితాలు సూచిస్తున్నాయని మొబిక్విక్ సహా వ్యవస్థాపకులు అన్నారు. 12 కోట్ల మంది వినియోగదారులు, 30లక్షల మంది వ్యాపారులు, 300 మందికిపై బిల్లర్లతో మొబిక్విక్ చెల్లింపుల నెట్వర్క్ భారత్ లోనే అతిపెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. 2009లో బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసనా టాకు చేత స్థాపించిన ఈ సంస్థ మార్క్యూ పెట్టుబడి దారుల నుంచి 100 మిలియన్లకు పైగా నిధులను సేకరించింది.
Published by:
Nikhil Kumar S
First published:
November 13, 2020, 7:17 PM IST