గురుగ్రామ్‌లోని మల్టీనేషనల్ కంపెనీలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఓ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్. గరుగ్రామ్‌లోని ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు జూలై నెలాఖరు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని హర్యానా ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధానికి దగ్గరగా ఉండే గురుగ్రామ్‌లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు భారీ ఎత్తున ఉన్నాయి. దేశంలోని చాలా ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని లక్షల మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు.
MNCs, IT, BPO offices in Gurgaon may have to 'work from home' till July end in view of COVID-19 crisis: Senior H'yana govt official
దేశంలో కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్‌తో ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అక్కడ ఉండే కంపెనీల్లో మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు విదేశాలకు వెళ్లడం, విదేశాల్లోలని ఆయా సంస్థల క్లైంట్లు భారత్‌కు వస్తూ పోతూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటి దేశాల వారిని భారత్‌లోకి అనుమతించే పరిస్థితి లేదు. మే 3 తర్వాత విమానయానం అనుమతి ఇవ్వాలా? వద్దా; అని ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గురుగ్రామ్‌లోని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల ఉద్యోగులు మరికొంత కాలం వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.