పెరుగుతున్న ధరలు, ఎక్కువ అవుతున్న ఖర్చుల నడుమ ఆరోగ్య సంరక్షణకు కుటుంబాలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయలేకపోతున్నాయి. అయితే సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు లేదా రెన్యువల్ చేసేటప్పుడు ప్లాన్‌లో కవర్ అయ్యే వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ చాలామంది ఇలాంటి ముఖ్యమైన అంశాలను విస్మరిస్తుంటారు. ఇది కొన్ని సాధారణ తప్పులకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేవారు తరచుగా చేసే తప్పులేంటి? ఈ తప్పులను ఎలా సరిచేసుకోవాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.
* మెరుగైన కవరేజీ ఆప్షన్‌ను ఎంచుకోకపోవడం
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చు అనేది.. పాలసీని నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొంతమంది తక్కువ ప్రీమియం ధరలు ఉండే పాలసీలను ఎంచుకుంటారు. ఇవి అందించే కవరేజీ సైతం తక్కువగా ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఆర్థికంగా ఆదుకోవడమే ఆరోగ్య బీమా పాలసీ ప్రాథమిక లక్ష్యం. అయితే మీరు అండర్ ఇన్సూరెన్స్ చేస్తే.. అవసరమైన సమయంలో లబ్దిదారులకు పాలసీ ప్రయోజనాన్ని నెరవేర్చడంలో విఫలం కావచ్చు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో తగినంత బీమా కవరేజీ లేకపోతే.. పాలసీ తీసుకొని ఉపయోగం ఉండదు. అందువల్ల తగినంత మొత్తానికి బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.
PM Kisan: ఎన్నికల ముందు రైతులకు బహుమతి.. పీఎం కిసాన్ డబ్బులు రెట్టింపు.. ఇక నుంచి రూ.12 వేలు..?
* బేసిక్ కవర్‌ను ఎంచుకోవడం
ప్రాథమిక కవరేజీ (basic coverage) కల్పించే హెల్త్ పాలసీల కంటే సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే కొంత డబ్బు ఆదా చేయవచ్చని భావించేవారు మాత్రం కేవలం బేసిన్ కవరేజీ చాలని భావిస్తారు. హెల్త్ ప్లాన్‌తో పాటు పర్సనల్ యాక్సిడెంట్ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ వంటివి అందించే ప్రయోజనాలను వారు గ్రహించరు. ఇలాంటి అన్ని రైడర్లు ఉండే పథకాన్ని పాలసీదారులు ఎంచుకోవాలి. అదనంగా అంబులెన్స్ ఛార్జీలు, డొమిసిలియరీ హాస్పిటలైజేషన్, నగదు రహిత ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రిలో చేరడం వంటి అదనపు ప్రయోజనాలను అందించే పాలసీని ఎంచుకోండి.
* మినహాయింపుల (Exclusions) గురించి తెలుసుకోకపోవడం
సాధారణంగా చాలామంది వ్యక్తులు పాలసీలో కవర్ అయ్యే విషయాల గురించి కచ్చితంగా తెలుసుకుంటారు. అయితే వారు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొన్న మినహాయింపులను పట్టించుకోరు. పాలసీ కవరేజీలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. మినహాయింపులను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఇన్సూరెన్స్ సంస్థలను బట్టి మారుతుంటాయి.
Ricky Ponting : " నాతో అలా చెప్పి ద్రావిడ్ కోచ్ పదవి తీసుకోవడంతో షాకయ్యాను " .. రికీ పాంటింగ్
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో వీటిపై దృష్టి పెట్టకపోవచ్చు. ఇలాంటప్పుడు ఫ్రీ లుక్ పీరియడ్ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు ప్రతి ఆరోగ్య బీమా పాలసీకి 15 రోజుల ఫ్రీ- లుక్ పీరియడ్ ఆప్షన్ ఉంటుంది. అంటే పాలసీ కొనుగోలు చేసిన తర్వాత హెల్త్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి 15 రోజుల సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో ఏదైనా నిబంధన సమస్యాత్మకంగా అనిపిస్తే, హెల్త్ ప్లాన్‌ను రద్దు చేసుకోవచ్చు.
* ఇతర బీమా సంస్థల గురించి ఆరా తీయకపోవడం
ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మార్చడానికి చాలామంది ఆసక్తి చూపరు. అయితే మీ ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీని రెన్యువల్ చేసే సమయంలో, ఇతర సంస్థలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో తెలుసుకోవడం మంచిది. కొన్నిసార్లు ప్రస్తుత ప్లాన్ కంటే మంచి ధరలో మెరుగైన కవరేజ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇలాంటి ఆఫర్లు ఉంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ని మార్చడానికి వెనుకాడకూడదు.
* మెడికల్ హిస్టరీ దాచిపెట్టడం
హెల్త్ ప్లాన్‌ను కొనుగోలు చేసే సమయంలో మీ వైద్య చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దాచి ఉంచకూడదు. ఇలాంటి సమాచారాన్ని దాచిపెడితే.. క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance