• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • MINISTRY OF URBAN AFFAIRS SWIGGY PARTNER TO TAKE STREET FOOD VENDORS BUSINESSES ONLINE SS GH

Swiggy: స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా? స్విగ్గీలో బుక్ చేసుకోవచ్చు

Swiggy: స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా? స్విగ్గీలో బుక్ చేసుకోవచ్చు

Swiggy: స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా? స్విగ్గీలో బుక్ చేసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Swiggy | మీకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా? కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ స్ట్రీట్ ఫుడ్‌కు దూరమయ్యారా? ఇకపై మీరు స్విగ్గీలో స్ట్రీట్ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.

  • Share this:
కోవిడ్–19 మహమ్మారి జనజీవనంపై పెను ప్రభావాన్నే చూపింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కోవిడ్ ప్రభావంతో వీధిలో దొరికే తినుబండారాలవైపు జనం చూడడమే మానేశారు. దీంతో అనేక మంది వీధి వ్యాపారులు తమ ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ వినూత్న పథకంతో ముందుకొచ్చింది. వీధి వ్యాపారుల కోసం 'ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి' స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం స్ట్రీట్ వెండర్స్‌కు, వినియోగదారులకు ఆన్‌లైన్ యాక్సెస్ ఇస్తారు. ఇది వారి వ్యాపారాలను పెంచుకోవడంలో సహాయపడుతుంది. కాగా ఈ పైలెట్ ప్రాజెక్టును మొదటగా అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ఇండోర్, వారణాసిలలో ప్రారంభించనునున్నారు.

Credit Score: మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందా? కారణాలు ఇవే

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆర్‌బీఐ అలర్ట్

రాబోయే కాలంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం 250 మంది విక్రేతలు ఈ పైలెట్ ప్రాజెక్టులో చేరనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా కోవిడ్ నిబంధనలు పాటించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వినియోగదారులకు ఇంట్లొనే కూర్కొని స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. కాగా, ఈ ప్రాజెక్టులో చేరాలనుకునే వీధి వ్యాపారులు తమ పాన్ మరియు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఐ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుబాటు ధరలో, ఉత్తమ పరిశుభ్రత మరియు ప్యాకేజింగ్ పద్ధతులతో ఫుడ్ డెలివరీ చేయడానికి స్ట్రీట్ వెండర్స్‌కు స్విగ్గీ సహాయపడుతుంది. ఈ మేరకు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్, స్విగ్గీ సీఈఓ రాహుల్ బోత్రా మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, స్విగ్గీ అధికారులు, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ఇండోర్, వారణాసి మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

PM SVANidhi Scheme: మీ వ్యాపారానికి రుణాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం... ఈ స్టెప్స్‌తో అప్లై చేయండి

PAN Card: మీరు విద్యార్థులా? పాన్ కార్డ్ తీసుకుంటే లాభాలు ఇవే

రూ.10000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్


కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన 'పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి' స్కీమ్ కింద రూ.10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను తీసుకోవచ్చు. ఈ స్కీంలో భాగంగా స్ట్రీట్ వెండర్స్ తీసుకున్న లోన్‌ను సంవత్సరంలోగా నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి. సకాలంలో రుణం చెల్లిస్తే ఏటా 7 శాతం మేర సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. 2020 మార్చి 24 వరకు వీధి వ్యాపారంలో ఉన్న 50 లక్షలకు పైగా వీధి విక్రేతలకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. 2020 అక్టోబర్ 4 నాటికి 'పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి' స్కీం పథకం కింద 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 7.5 లక్షలకు పైగా దరఖాస్తులకు ఆమోదం లభించగా, 2.4 లక్షల మంది దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు చేశారు.
Published by:Santhosh Kumar S
First published: