హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే

New Rules: పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే

New Rules: పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | మీ పిల్లల్ని బైక్ పైన షికారుకు తీసుకెళ్తున్నారా? పిల్లలతో కలిసి టూవీలర్‌పై (Two Wheeler) లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నారా? అయితే అలర్ట్. పిల్లల్ని టూవీలర్‌పై తీసుకెళ్లేవారికి కొత్త నియమనిబంధనలు (New Rules) అమలులోకి రాబోతున్నాయి.

ఇంకా చదవండి ...

పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తున్న తల్లిదండ్రులకు అలర్ట్. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కొత్త నియమనిబంధనల్ని ప్రతిపాదించింది. బైకులపై పిల్లల్ని తీసుకెళ్లే వారి కోసం కొత్తగా భద్రతా చర్యల్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (Draft Notification) విడుదల చేసింది. సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 లో సవరణలు చేసేందుకు కొత్త రూల్స్ ప్రతిపాదించింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. కొత్తగా ప్రతిపాదించిన నియమనిబంధనల ప్రకారం 4 ఏళ్ల లోపు పిల్లల్ని టూవీలర్ పైన తీసుకెళ్తుంటే ఆ వాహనం స్పీడ్ గంటకు 40 కిలోమీటర్ల వేగం దాటకూడదు. ఈ స్పీడ్ లిమిట్ దాటితే రూ.1,000 జరిమానా చెల్లించడంతో పాటు సదరు డ్రైవర్ లైసెన్స్ మూడు నెలలు రద్దు చేస్తుంది రవాణా శాఖ.

myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో ఈ 11 రకాల సేవలు పొందొచ్చు

ఇక దీంతో పాటు 9 నెలల నుంచి 4 ఏళ్ల లోపు పిల్లల్ని బైక్‌పై తీసుకెళ్తే వారికి ఖచ్చితంగా క్రాష్ హెల్మెట్ ఉండేలా చూడాలి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఈ నియమనిబంధనల్ని వివరించింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. వీటితో పాటు నాలుగేళ్ల లోపు పిల్లల్ని బైక్‌పై ఎక్కించుకునే ప్రయాణికులు సేఫ్టీ హార్‌నెస్ ఉపయోగించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చెబుతోంది.

డ్రైవర్లు ఉపయోగించే సేఫ్టీ హార్నెస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. ఇది లైట్ వెయిట్, అడ్జస్టబుల్, వాటర్ ప్రూఫ్‌తో ఉండాలి. హెవీ నైలాన్‌తో రూపొందించినదై ఉండాలి. 30 కిలోల బరువును ఆపగలగాలి. పిల్లలు టూవీలర్ పై నుంచి కిందకు పడిపోకుండా వాహనం నడిపే ప్రయాణికులను అటాచ్ చేసేందుకు సేఫ్టీ హార్‌నెస్ బెల్ట్ ఉపయోగపడుతుంది. వాహనదారులు ఈ బెల్టును తమ భుజాలపైనుంచి ధరించి పిల్లల్ని తమకు అటాచ్ చేసుకోవచ్చు.

SBI IMPS: వెంటనే డబ్బులు పంపాలా? ఎస్‌బీఐ ఐఎంపీఎస్ సర్వీస్ వాడుకోండి ఇలా

అయితే ఇవి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో వివరించిన నియమనిబంధనలు మాత్రమే. ఏవైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే ప్రజలు వెల్లడించొచ్చు. ప్రజల అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మార్పులు చేసి నియమనిబంధనల్ని అమలులోకి తీసుకొస్తుంది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. ఈ ప్రాసెస్ 30 రోజుల్లో పూర్తవుతుంది. 2022 చివరి నాటికి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రూల్స్ పాటించాలి.

First published:

Tags: Auto News, TRAFFIC AWARENESS, Traffic challans, Traffic rules, Two wheeler

ఉత్తమ కథలు