Home /News /business /

MINISTRY OF ROAD TRANSPORT AND HIGHWAYS NOTIFIES REVISED THIRD PARTY INSURANCE PREMIUM KNOW HOW MUCH TO PAY FOR TWO WHEELER AND CARS SS

Vehicle Insurance: జూన్ 1 నుంచి బైక్, కార్ ఇన్స్యూరెన్స్ పెంపు... వారికి డిస్కౌంట్

Vehicle Insurance: జూన్ 1 నుంచి బైక్, కార్ ఇన్స్యూరెన్స్ పెంపు... వారికి డిస్కౌంట్
(ప్రతీకాత్మక చిత్రం)

Vehicle Insurance: జూన్ 1 నుంచి బైక్, కార్ ఇన్స్యూరెన్స్ పెంపు... వారికి డిస్కౌంట్ (ప్రతీకాత్మక చిత్రం)

Vehicle Insurance | వాహనదారులకు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ (Third Party Insurance) ప్రీమియం మరింత భారం కానుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ప్రీమియం వివరాలను వెల్లడించింది. అయితే కొందరికి ప్రీమియంలో డిస్కౌంట్ లభిస్తుంది.

ఇంకా చదవండి ...
వాహనదారులకు అలర్ట్. జూన్ 1 నుంచి థర్డ్ పార్టీ మోటార్ ఇన్స్యూరెన్స్ (Third Part Insurance) ప్రీమియం పెరగబోతోంది. అన్ని కేటగిరీలకు ఇది వర్తిస్తుంది. సవరించిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (Insurance Premium) వివరాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పెరిగిన ప్రీమియం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీతో సంప్రదింపులు జరిపి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇలా ప్రీమియం వివరాలను వెల్లడించడం ఇదే మొదటిసారి. వాహనదారులకు జూన్ 1 నుంచి కార్లు, టూ వీలర్ల ఇన్స్యూరెన్స్ మరింత భారం కానుంది.

కరోనా వైరస్ మహమ్మారి కన్నా ముందు నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా 2019-2020 లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం సవరించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 1,000 సీసీ ఇంజిన్ కెపాసిటీ లోపు ప్రైవేట్ కార్లకు రూ.2,094 ఇన్స్యూరెన్స్ చెల్లించాలి. 2019-2020 నుంచి ఇది రూ.2,072 ఉండేది. ఇక 1,000 సీసీ నుంచి 1,500 సీసీ మధ్య ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కార్లకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం రూ.3,221 నుంచి రూ.3,416 కి పెరిగింది. అయితే 1,500 సీసీ దాటిన కార్ల ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890 కి తగ్గడం విశేషం.

Ola S1 Pro: రూ.1,39,000 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితం... వారికి మాత్రమే


ఇక టూవీలర్ల విషయానికి వస్తే 75 సీసీ లోపు టూవీలర్లకు రూ.538 ప్రీమియం, 75 సీసీ నుంచి 150 సీసీ టూవీలర్లకు రూ.714 ప్రీమియం, 150 సీసీ నుంచి 350 సీసీ టూవీలర్లకు రూ.1,366 ప్రీమియం, 350 సీసీ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న టూవీలర్లకు రూ.2,804 ప్రీమియం చెల్లించాలి. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఇన్సూరెన్స్ ప్రీమియంపై 7.5 శాతం డిస్కౌంట్ ప్రకటించింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.

PAN Card Rule: పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే

ఇక 30KW కెపాసిటీలోపు ఉన్న ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు రూ.1,780 ప్రీమియం, 30KW నుంచి 65KW కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు రూ.2,904 ప్రీమియం వర్తిస్తుంది. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే రోడ్డు ప్రమాదం కారణంగా ఎవరికైనా వ్యక్తులు గాయాలపాలైతే కవరేజీ లభిస్తుంది. కాబట్టి వాహనదారులు సొంత డ్యామేజీ కవరేజీతో పాటు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి.

విద్యాసంస్థల బస్సులకు ఇన్స్యూరెన్స్ ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వింటేజ్ కార్లుగా రిజిస్టర్ అయిన ప్రైవేట్ కార్లకు 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Cars, Four wheelers, Insurance, Irdai, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు