హోమ్ /వార్తలు /బిజినెస్ /

Rs 15 lakh prize money: మోదీ ప్రభుత్వం అద్భుత అవకాశం... రూ.15,00,000 గెలుచుకోండి ఇలా

Rs 15 lakh prize money: మోదీ ప్రభుత్వం అద్భుత అవకాశం... రూ.15,00,000 గెలుచుకోండి ఇలా

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Rs 15 lakh prize money | మోదీ ప్రభుత్వం అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఓ కాంటెస్ట్ ద్వారా రూ.15,00,000 వరకు గెలుచుకునే అవకాశం ఇది.

కేంద్ర ప్రభుత్వం ఓ కాంటెస్ట్ ప్రారంభించింది. ఈ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.15,00,000 గెలుచుకోవచ్చు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్-DFI ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర బడ్జెట్ 2021 లోనే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్-NIP కింద 2024-25 నాటికి 7000 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో రూ.111 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది ప్రభుత్వం. డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు పేరు, ట్యాగ్‌లైన్, లోగో సూచించాలంటూ కేంద్ర ప్రభుత్వం కాంటెస్ట్ ప్రారంభించింది. గెలిచినవారికి భారీగా ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఒక్కో కేటగిరీలో రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు గెలుచుకోవచ్చు.

Bank Holidays in August 2021: ఆగస్టులో బ్యాంకులకు సెలవులే సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండి

IRCTC New Rule: ఐఆర్‌సీటీసీ కొత్త రూల్... టికెట్ బుక్ చేయాలంటే ఇది కంపల్సరీ

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కాంటెస్ట్ కొనసాగుతోంది. డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు మంచి పేరు సూచించినవారికి మొదటి బహుమతిగా రూ.5,00,000, రెండో బహుమతిగా రూ.3,00,000, మూడో బహుమతిగా రూ.2,00,000 ఇవ్వనుంది. ఇక ట్యాగ్‌లైన్ కేటగిరీలో మొదటి బహుమతి రూ.5,00,000, రెండో బహుమతి రూ.3,00,000, మూడో బహుమతి రూ.2,00,000 గెలుచుకోవచ్చు. లోగో డిజైనింగ్ కేటగిరీలో కూడా మొదటి బహుమతి రూ.5,00,000, రెండో బహుమతి రూ.3,00,000, మూడో బహుమతి రూ.2,00,000 చొప్పున లభిస్తుంది. మూడు కేటగిరీల్లో మొత్తంగా రూ.15,00,000 గెలుచుకోవచ్చు.

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.4,950 మీ అకౌంట్‌లోకి

Pension Scheme: నెలకు రూ.3,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి... జీతం తక్కువ ఉన్నవారికే అవకాశం

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారు తమ ఎంట్రీలు పంపడానికి 2021 ఆగస్ట్ 15 చివరి తేదీ. ఈ కాంటెస్ట్‌లో పౌరులు ఎవరైనా పాల్గొనొచ్చు. డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు పేరు, ట్యాగ్‌లైన్, లోగో సూచించొచ్చు. పేరు, ట్యాగ్‌లైన్, లోగో సూచించే ముందు విజువల్ సిగ్నేచర్, సులభంగా గుర్తుతెచ్చుకోగలగడం, సులభంగా పలకడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగా వాటిని రూపొందించి ఎంట్రీలు పంపాలి. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.mygov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇప్పటికే 100 పైగా ఎంట్రీలు వచ్చాయి.

First published:

Tags: Finance minister, Nirmala sitharaman

ఉత్తమ కథలు