Home /News /business /

MINISTER KTR TOUR HAS ENDED SUCCESSFULLY AND ON THE LAST DAY 4 COMPANIES ANNOUNCED THAT THEY WOULD BE INVESTING IN TELANGANA PRV

KTR America Tour: ముగిసిన మంత్రి కేటీఆర్​ అమెరికా పర్యటన.. భారీగా పెట్టుబడులు ప్రకటించిన పలు సంస్థలు.. వివరాలివే..

స్లేబ్యాక్​ సీఈవో అజయ్​ సింగ్​తో కేటీఆర్​

స్లేబ్యాక్​ సీఈవో అజయ్​ సింగ్​తో కేటీఆర్​

మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన (KTR America Tour) విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్నట్లు చివరి రోజు 4 సంస్థలు ప్రకటించాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లైఫ్ సైన్సెస్ (Life sciences), ఫార్మా (Pharma) కంపెనీలు ముందుకొచ్చాయి.

ఇంకా చదవండి ...
    మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన (KTR America Tour) విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్నట్లు చివరి రోజు 4 సంస్థలు ప్రకటించాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లైఫ్ సైన్సెస్ (Life sciences), ఫార్మా (Pharma) కంపెనీలు ముందుకొచ్చాయి. కేటీఆర్ (Minister KTR) తో సమావేశం అనంతరం తమ నిర్ణయాలు కంపెనీలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..  న్యూయార్క్‌ (Newyork)లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ (Advent International) హెడ్ క్వార్టర్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో  కేటీఆర్​ సమావేశం అయ్యారు. భారత్‌లోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌ (Hyderabad)లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో వారు చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆర్ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్‌ (Avra Laboratories‌)లో మెజార్టీ వాటాలు కొనేందుకుపెట్టుబడులు పెట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌కు అడ్వెంట్ కంపెనీ (Advent) తెలిపింది. ఆ పెట్టుబడుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్​ స్వాగతించారు. కాగా, పెట్టుబడుల విషయాన్ని కేటీఆర్​ తన ట్వీట్ల ద్వారా వెల్లడించారు.

    ఫార్మారంగంలో..

    హైదరాబాద్‌లో భారీ విస్తరణ ప్రణాళికలు న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తోన్న స్లేబ్యాక్ ఫార్మా (Slay back pharma) ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. హైదరాబాద్‌ ఫార్మారంగంలో (Pharma In Hyderabad) విస్తరణకు వ్యూహాలు రచించినట్లు సదరు కంపెనీలు మంత్రి కేటీఆర్‌కు తెలిపాయి. రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ ఎదుగుదలకు ఉన్న అవకాశాలను మంత్రి (KTR) వివరించారు.  స్లే బ్యాక్ కంపెనీ విధానాలను కూడా మంత్రి కేటీఆర్ కొనియాడారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్‌ సైన్సెస్ రంగానికి హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకోవాలని కోరారు.



    లైఫ్ సైన్సెస్ రంగానికి..

    హైదరాబాద్‌లోని (Hyderabad) లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో రూ.1,750 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇస్తున్న ప్రాధాన్యం, కల్పిస్తున్న మౌలిక వసతుల వల్ల తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో చెప్పారు.



    అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా 2 లక్షల వేల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.



    అత్యాధునిక ప్రయోగశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, మూలధనం కోసం రెండేళ్లుగా 5 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని 70 మందికి ఉద్యోగాలను కల్పించిందని మంత్రి కేటీఆర్‌కు కంపెనీ వివరించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: America, BUSINESS NEWS, Investments, Minister ktr

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు