Home /News /business /

MINISTER GADKARI SAYS E CARS WILL COST SAME AS PETROL VEHICLES IN NEXT 2 YEARS NS

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి శుభవార్త.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) వినియోగంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) శుభవార్త చెప్పారు. మరో రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల (Petrol Vehicles) స్థాయికి చేరుతుందని తెలిపారు. గడ్కరీ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ AGMలో గడ్కరీ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల ధర క్రమంగా తగ్గుతుందన్నారు. రెండేళ్లలో ఎలక్ట్రిక్ కార్ మోడళ్ల ధర పెట్రోల్ మోడళ్ల కన్నా తగ్గుతుందన్నారు. 2023 కల్లా 600 EV ఛార్జింగ్ పాయింట్లను దేశంలోని మేజర్ హైవేల పక్కన ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఛార్జింగ్ స్టేషన్లను సోలార్, పవన విద్యుత్ ఆధారంగా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పెట్రోల్ వాహనాలకు కిలో మీటర్ కు రూ. 10 ఖర్చు అవుతుందన్నారు. అదే ఎలక్ట్రిక్ వాహనాలకు కేవలం రూ. 7 మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే నిర్వహణ వ్యయం తక్కువగా ఉన్నా.. ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉందన్నారు.
    Electric vehicles: "స్మార్ట్‌"గా క‌న్నేస్తున్నాయి... ఈవీ మార్కెట్‌పై మొబైల్ కంపెనీల దృష్టి

    ఈ నేపథ్యంలో ఆ వాహనాలపై జీఎస్టీని తగ్గించామన్నారు. వాహనాల ధర కూడా తగ్గుతుందన్నారు. వాహనాల ఛార్జింగ్ కోసం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. వాహనాల తయారీ రంగం రానున్న రోజుల్లో వాహనాల్లో బహుళ ఇంజన్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
    Bounce Infinity: డిసెంబర్ 2న మార్కెట్లోకి బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్, కేవలం రూ.499కే బుక్ చేసుకునే చాన్స్..

    వాహనాలు పెట్రోల్ మరియు ఇథనాల్ తో పని చేసేలా రెండు ఇంజన్ లు ఏర్పాటు చేస్తాయన్నారు. పెట్రోల్ తో పోల్చితే ఇథనాల్ ధర తక్కువ అని అన్నారు. ఇథనాల్ ద్వారా ఏర్పడే కాలుష్యం సైతం తక్కువేనన్నారు. ఇందనం దిగుమతికి ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని పెట్రోల్ పంపుల్లో ఈవీ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసేలా ప్రభత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
    Bounce Infinity: డిసెంబర్ 2న మార్కెట్లోకి బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్, కేవలం రూ.499కే బుక్ చేసుకునే చాన్స్..

    ఇదిలా ఉంటే.. గ్రీవ్స్ కాటన్, ఇ-మొబిలిటీ యూనిట్ అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మంగళవారం తమిళనాడులోని రాణిపేటలో తన అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెనరసు ప్రారంభించారు. 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ తమిళనాడులోని ఇండస్ట్రియల్ హబ్‌లో ఉందని, దేశీయ, ఎగుమతి మార్కెట్‌లకు ఈ-మొబిలిటీ హబ్‌గా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
    Ola Electric: నవంబర్ 27 నుంచి విశాఖపట్నం, విజయవాడలో ఓలా ఎలక్ట్రిక్ టెస్ట్ రైడ్

    రాణిపేటలో ప్రారంభించిన ఈ ప్లాంట్ ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రకటించిన రూ.700 కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగమని మీకు తెలియజేద్దాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ EV మార్కెట్‌లో తన వాటాను మరింత పెంచుకోవడానికి కంపెనీ కృషి చేస్తోంది. గత నెలలో కంపెనీ 7,500 యూనిట్లకు పైగా విక్రయించింది. అదనపు అసెంబ్లీ లైన్లతో, ఈ తయారీ కర్మాగారం ప్రతి సంవత్సరం 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Electric Bikes, Electric vehicle, Nitin Gadkari, Petrol price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు