అద్దాల రైలులో ప్రయాణించాలనుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే మరో అద్దాల రైలును ప్రారంభించింది. పశ్చిమ కనుమల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. బెంగళూరులో మొదలయ్యే ఈ రైలు సఖ్లేష్‌పూర్, సుబ్రహ్మణ్య ఘాట్ సెక్షన్ రూట్‌లో పశ్చిమ కనుమల మీదుగా మంగళూరుకు చేరుకుంటుంది. పశ్చిమ కనుమల్లో పచ్చని అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కర్నాటక వెళ్లే టూరిస్టులు పశ్చిమ కనుమల మీదుగా ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొండలు, లోయలు, పచ్చని అందాలు చూసుకుంటూ రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వర్షాకాలంలో ప్రయాణం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫోటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రపంచ ప్రఖ్యాత కుక్కి సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులు ఈ రైలులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి ధర్మస్థలి కూడా వెళ్లొచ్చు. పర్యాటకులను ఆకట్టుకోవడానికి అద్దాల రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే ఈ రూట్‌లో తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌లతో రైలును ప్రారంభించడం విశేషం. ఈ రైలులో ప్రయాణం, విస్టాడోమ్ కోచ్ ప్రత్యేకతల్ని వివరించే వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.
IRCTC Tirupati Tour: ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసేవారికి తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం
IRCTC Char-Dham Yatra: చార్‌ధామ్ యాత్ర ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ ధర ఎంతంటే
Vistadome coaches for the first time in SWR are introduced on the picturesque Yesvantpur - Mangaluru Jn route!
Take a look at the exciting features of the coach: pic.twitter.com/Mvq8rh60OJ
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 12, 2021
రైలు నెంబర్ 06575 ప్రతీ మంగళవారం, గురువారం, ఆదివారం యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. రైలు నెంబర్ 06576 ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం మంగళూరు జంక్షన్‌లో బయల్దేరుతుంది. రైలు నెంబర్ 06211 సోమవారం, బుధవారం, శుక్రవారం యశ్వంత్‌పూర్‌లో, రైలు నెంబర్ 06212 ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం మంగళూరు జంక్షన్‌లో బయల్దేరుతుంది. ఇక రైలు నెంబర్ 06539 ప్రతీ శనివారం యశ్వంత్‌పూర్‌లో, రైలు నెంబర్ 06540 ప్రతీ ఆదివారం మంగళూరు జంక్షన్‌లో బయల్దేరుతుంది.
IRCTC: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త... పంచదేవాలయం టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
IRCTC Work From Hotel: హిమాలయాలను చూసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
ఈ రైలులో రెండు విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. ప్రతీ విస్టాడోమ్ కోచ్‌లో 44 మంచి ప్రయాణించొచ్చు. 180 డిగ్రీలు తిరిగే చైర్స్ ఉంటాయి. ప్రతీ సీట్‌కు స్నాక్ టేబుల్స్ ఉంటాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో విస్టాడోమ్ కోచ్ తయారైంది. ఇందులో సీసీటీవీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, ఎల్ఈడీ డిస్‌ప్లే, ఓవెన్, రిఫ్రిజిరేటర్, మినీ ప్యాంట్రీ, స్టీల్ లగేజ్ షెల్ఫ్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రతీ కోచ్‌లో ఆటోమెటిక్ స్లైడింగ్ డోర్స్, బయో టాయిలెట్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది.
భారతీయ రైల్వే మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లను తయారు చేస్తోంది. ఇప్పటికే పలు పర్యాటక ప్రాంతాల్లో కొన్ని రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లను జత చేసింది. విశాఖపట్నం-అరకు రూట్‌లో విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అరకు వ్యాలీతో పాటు కాశ్మీర్ లోయ, డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే, కల్క షిమ్లా రైల్వే, నీల్‌గిరి మౌంటైన్ రైల్వే లాంటి ప్రాంతాల్లో ఈ విస్టాడోమ్ కోచ్‌లు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best tourist places, Indian Railway, Indian Railways, IRCTC, IRCTC Tourism, Railways, Special Trains, Tourism, Tourist place, Train, Train tickets, Travel