హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Thar: మహీంద్రా థార్ కొత్త మోడల్ కొనాలనుకుంటున్నారా?.. అన్ని నెలలు ఆగాల్సిందే..

Mahindra Thar: మహీంద్రా థార్ కొత్త మోడల్ కొనాలనుకుంటున్నారా?.. అన్ని నెలలు ఆగాల్సిందే..

mahindra thar (Image: Facebook)

mahindra thar (Image: Facebook)

Mahindra Thar: మహీంద్రా థార్క్‌కు వస్తున్న అపూర్వమైన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, డిమాండ్‌ను తీర్చడానికి, వినియోగదారుల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఇటీవల విడుదల చేసిన కొత్త థార్ మోడల్కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 20,000 బుకింగ్స్ మార్క్‌ను దాటిందని సంస్థ ప్రకటించింది. కస్టమర్ల నుంచి వస్తున్న అనూహ్య స్పందన దృష్ట్యా కొత్త థార్ వేరియంట్ను సొంతం చేసుకోవాలంటే దాదాపు 5 నుంచి 7 నెలల సమయం పట్టవచ్చని పేర్కొంది. వినియోగదారుల నుంచి వస్తున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి సంస్థ కార్ల ఉత్పత్తిలో వేగం పెంచింది. వినియోగదారులు థార్ మోడల్‌ను బుక్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తోంది.

ముఖ్యంగా, అంచనాలను అధిగమించిన ఈ వేరియంట్లలో హార్డ్ టాప్ ఆటోమేటిక్‌తో పాటు డీజిల్, పెట్రోల్ ఆప్షన్లతో వచ్చే మ్యానువల్ వేరియంట్లు ఉన్నాయి. మహీంద్రా థార్క్‌కు వస్తున్న అపూర్వమైన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, డిమాండ్‌ను తీర్చడానికి, వినియోగదారుల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. నవంబర్ 1న ప్రారంభమైన కొత్త థార్ వేరియంట్ మొదటి కారు ఆన్‌లైన్ వేలంలో విజేతకు పంపిణీ చేయబడింది. కాగా, వారాంతంలోగా దేశవ్యాప్తంగా 500 కొత్త థార్‌ మోడల్స్ మెగా డెలివరీలను ప్లాన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

అధిక డిమాండ్‌తో ఉత్పత్తి పెంపు

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ “కొత్త తరం థార్ మోడల్ కారుకు వచ్చిన ఈ అపూర్వమైన స్పందనకు మేం ఎంతో ఆనందిస్తున్నాం. వినియోగదారుల నుంచి వచ్చిన ఈ స్పందన మా అంచనాలను, ఉత్పత్తి సామర్థ్యాలను అధిగమించింది. అందువల్ల, కొత్త థార్ డెలివరీ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. మా కస్టమర్ల సహనాన్ని, మాపై అచంచలమైన విశ్వాసాన్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మేము గతంలో నెలకు సుమారు 2,000 వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. కానీ ప్రస్తుతం అధిక డిమాండ్ దృష్ట్యా జనవరి కల్లా ఆ సంఖ్యను 3,000కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల మా కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది.”అని అన్నారు. ప్రతి కస్టమర్‌ను వ్యక్తిగతంగా చేరుకోవడానికి, వారి ఖచ్చితమైన డెలివరీ తేదీలను కమ్యూనికేట్ చేయడానికి కంపెనీ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసింది. వారి వెయిటింగ్ పీరియడ్కు అనుగుణంగా భరోసా కల్పించి డెలివరీ చేసేందకు ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Automobiles

ఉత్తమ కథలు