news18-telugu
Updated: December 2, 2020, 3:04 PM IST
Post Office Savings Account: ఖాతాదారులకు అలర్ట్... మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మారాయి
(ప్రతీకాత్మక చిత్రం)
పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్‌ని మార్చింది ఇండియా పోస్ట్. 2020 డిసెంబర్ 11 నుంచి రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి చేసింది. డిసెంబర్ 11 నుంచి రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఇండియా పోస్ట్ ట్విట్టర్లో వెల్లడించింది. డిసెంబర్ 11 నుంచి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి చేసినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రూల్ చూస్తే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అకౌంట్లో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అకౌంట్ మెయింటనెన్స్ ఫీజు కింద అకౌంట్ నుంచి రూ.100 తగ్గిస్తుంది ఇండియా పోస్ట్. ఒకవేళ బ్యాలెన్స్ ఏమీ లేకపోతే అకౌంట్ ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మినిమమ్ బ్యాలెన్స్ రూ.500 అకౌంట్లో ఉండాలి. కానీ కొత్త రూల్ ప్రకారం ఇకపై ఏడాదంతా ఏ రోజు చూసినా అకౌంట్లో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సింది. కాబట్టి మీకు పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే మొదట బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయండి. రూ.500 కన్నా తక్కువ ఉంటే అకౌంట్ మెయింటనెన్స్ ఫీజు తప్పించుకోవడానికి డబ్బులు జమ చేయండి.
Job Loss Insurance: ఉద్యోగం పోతే ఇన్స్యూరెన్స్... వారానికి రూ.1,00,000 వరకు బెనిఫిట్EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఈ 4 ప్రయోజనాలు మీకే
ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వివరాలు చూస్తే ఇది బ్యాంకులో ఓపెన్ చేసే సేవింగ్స్ అకౌంట్ లాంటిదే. మైనర్లు సహా ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. రూ.500 నుంచి ఎంతవరకైనా డబ్బులు దాచుకోవచ్చు. ప్రతీ పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌పై ఏటీఎం కార్డ్, చెక్ బుక్ వస్తాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా చేయొచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫామ్ పూర్తి చేసి, కేవైసీ వివరాలు సబ్మిట్ చేస్తే చాలు. అకౌంట్ ఓపెన్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా కూడా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో దాచుకునే డబ్బులకు ఏటా 4 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.25% నుంచి 7.50% శాతం మధ్య ఉంటాయి.
Published by:
Santhosh Kumar S
First published:
December 2, 2020, 3:04 PM IST