క్యాన్సర్‌తో కన్నుమూసిన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ పాల్ అలెన్

మైక్రోసాఫ్ట్ స్థాపించిన తర్వాత అల్లెన్ ఇన్వెస్టర్‌గా మారారు. వుల్కన్ పేరుతో ఇన్వెస్టింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. రాకెట్ లాంఛింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రాటోలాంచ్ సిస్టమ్స్ కూడా ప్రారంభించారు. 2003లో అల్లెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ సైన్స్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

news18-telugu
Updated: October 16, 2018, 2:00 PM IST
క్యాన్సర్‌తో కన్నుమూసిన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ పాల్ అలెన్
పాల్ అల్లెన్ ఫైల్ ఫోటో (Reuters)
  • Share this:
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్లెన్ క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయారు. 65 ఏళ్ల వయస్సులో అల్లెన్ కన్నుమూశారు. 1970లో బిల్ గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ని స్థాపించారు పాల్ అల్లెన్. ఆయన సీటిల్‌ హైస్కూల్‌లో బిల్ గేట్స్ క్లాస్‌మేట్. ఆ తర్వాత ఇద్దరూ చదువు మధ్యలోనే ఆపేసి మైక్రోసాఫ్ట్‌ని ప్రారంభించారు. అయితే పాల్ అల్లెన్ ఆరోగ్య కారణాలతో 1983లోనే మైక్రోసాఫ్ట్‌ని వదిలేసి వెళ్లారు. కానీ కంపెనీలో తన షేర్లను అలాగే ఉంచాడు. 1990వ దశకంలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌లో పాల్ షేర్ల విలువ 20 బిలియన్ డాలర్లకు చేరింది.

మైక్రోసాఫ్ట్‌తో పాటు, సాఫ్ట్‌వేర్ రంగానికి పాల్ అల్లెన్ ఎన్నో సేవలు చేశారు. మైక్రోసాఫ్ట్‌లో ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులు, అనుభవాలు, సంస్థలు సృష్టించారు. వాటితో ఆయన ఏకంగా ప్రపంచాన్నే మార్చేశారు.
సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
క్యాన్సర్‌తో కన్నుమూసిన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ పాల్ అలెన్,Microsoft Co-Founder Paul Allen Dies of Incurable Cancer at 65

మైక్రోసాఫ్ట్ స్థాపించిన తర్వాత అల్లెన్ ఇన్వెస్టర్‌గా మారారు. వుల్కన్ పేరుతో ఇన్వెస్టింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. రాకెట్ లాంఛింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రాటోలాంచ్ సిస్టమ్స్ కూడా ప్రారంభించారు. 2003లో అల్లెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ సైన్స్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. దశాబ్దం తర్వాత సమాజంపై సరికొత్త టెక్నాలజీల ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు అల్లెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, రోగాలకు చికిత్సా విధానాలను కనుగొనేందుకు అల్లెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెల్ సైన్స్ ఏర్పాటు చేశారు.

అల్లెన్ పెళ్లి చేసుకోలేదు. స్పోర్ట్స్ అంటే ఇష్టం. 1988లో ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌ని కొన్నారు. రెండుసార్లు ఎన్‌బీఏ ఫైనల్స్‌కు తీసుకెళ్లారు. ఎన్ఎఫ్ఎల్‌లో ఆయన టీమ్ మూడు సూపర్ బౌల్స్ ఆడితే... సూపర్ బౌల్-48 గెలుచుకోవడం విశేషం. ధాతృత్వంలోనూ ఆయనకు గొప్ప పేరుంది. పలు సంస్థలకు ఆయన విరాళాలిచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఏసుస్ నుంచి మరో రెండు ఫోన్లు!

గూగుల్‌లోనే ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ 'షాపింగ్ ట్యాబ్స్'

ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!

త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!

ఇన్‌స్టాగ్రామ్ చూస్తే అసూయా? ఇలా తగ్గించుకోండి!
First published: October 16, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు