MGS UPCOMING ELECTRIC CAR SEEN ON THE ROADS KNOW ITS FEATURES AND PRICE MK
MG ZS Electric: ఎంజీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు విడుదలకు సిద్ధం...MG ZS Electric ఫీచర్స్ ఇవే..
ప్రతీకాత్మకచిత్రం (2021 MG ZS EV)
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG ZS ఎలక్ట్రిక్ తన ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను విడుదల చేయబోతోంది. అయితే లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG ZS ఎలక్ట్రిక్ తన ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను విడుదల చేయబోతోంది. అయితే లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇటీవల MG ZS EV ఫేస్‌లిఫ్ట్ మోడల్ గుజరాత్లో టెస్టింగ్ సమయంలో గుర్తించారు. ఆటో వెబ్సైట్ రష్ లేన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ZS EVని ఫేస్‌లిఫ్ట్ చేసిన కారు అని పేర్కొంది. అంతేకాదు ఇది వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేశారు. ZS EV కంపెనీ డిజైన్ లాంగ్వేజ్ దాని గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ దీన్ని యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ EV ప్రస్తుత మోడల్ని పోలి ఉంది. అయితే పెద్ద ఎయిర్ డ్యామ్ స్పేస్‌తో రీడిజైన్ చేసినన ఫ్రంట్ బంపర్ ఈ కారులో గమనించవచ్చు. ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ 17-అంగుళాల మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ సెట్‌ను ఇందులో చూడవచ్చు. ఇతర డిజైన్ హైలైట్లు ప్రస్తుత మోడల్లోనే ఉంటాయి.
🚘 NEW WORK 🚘
We had such a great time producing these TV spots with @m3agencyuk for @MGmotor to launch the new MG ZS EV - directed by Giles Ripley and produced by James Shannon. Edited in-house The Gate Films, with VFX by @flipbookstudio 🎨 pic.twitter.com/mkwdnCD5z4
కొత్త MG ZS EVలో ఛార్జింగ్ పోర్ట్‌లో నాలుగు దశల LED ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. తద్వారా మీరు ఛార్జింగ్ ఎంత అయ్యిందో ఇందులో చూడవచ్చు. ఇది కాకుండా దీనికి షార్ప్ హెడ్ , టెయిల్ ల్యాంప్స్ గమనించవచ్చు. ఇందులో ప్రత్యేక గ్రిల్ లేదు. ఇది కాకుండా, వెనుక ప్యానెల్ , అల్లాయ్ వీల్లో కూడా కొన్ని అప్డేట్ లను ఇందులో చూడవచ్చు. ఈ EVలో టైప్ 2 ఛార్జింగ్ , CCS ఛార్జర్ ను గమనించవచ్చు. ఈ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
కారు ఇంటీరియర్స్
కంపెనీ అప్ డేట్ ప్రకారం వాహనం లోపలి భాగాన్ని కొన్ని కొత్త ఫీచర్లను గమనించవచ్చు. ఇందులో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గమనించవచ్చు. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ MG కొత్త iSMART ఆధారంగా రూపొందించారు. ఇది కాకుండా, రిమోట్ కంట్రోల్ ఫంక్షనాలిటీ , కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో జోడించారు. ఇది కాకుండా వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఇందులో అందించబడింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.