MG Astor: భారత మార్కెట్​లోకి ఎంజీ ఆస్టర్​ ఎస్​యూవీ లాంచ్.. ఏఐ, అటానమస్​ టెక్నాలజీ గల మొట్టమొదటి కారు​

ప్రతీకాత్మకచిత్రం

బ్రిటీష్​ కార్ల తయారీ దిగ్గజం మోరిస్​ గ్యారేజ్​ (ఎంజీ) భారత మార్కెట్​లోకి కొత్త మిడ్​సైజ్​ ఎస్​యూవీ ఆస్టర్​ మోడల్​ను లాంచ్​ చేసింది. పండుగ సీజన్​లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

  • Share this:
rsబ్రిటీష్​ కార్ల తయారీ దిగ్గజం మోరిస్​ గ్యారేజ్​ (ఎంజీ) భారత మార్కెట్​లోకి కొత్త మిడ్​సైజ్​ ఎస్​యూవీ ఆస్టర్​ మోడల్​ను లాంచ్​ చేసింది. పండుగ సీజన్​లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అనేక అధునాతన టెక్నాలజీ ఫీచర్లను జోడించింది. దేశంలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ), అటానమస్ (లెవల్ 2) టెక్నాలజీ గల మొదటి ఎస్​యూవీ ఇదే కావడం విశేషం. కేవలం పెట్రోల్​ వెర్షన్​లోనే అందుబాటులో ఉండే ఈ ఎస్​యూవీ హ్యుండాయ్​ క్రెటా, కియా సెల్టోస్​, నిసాన్​ కిక్స్​, రెనాల్ట్​ డస్టర్​, స్కోడా కుశక్​, వోక్స్​వాగన్​ టైగన్​లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

ఎంజీ ఆస్టర్ ధర

ఎంజీ ఆస్టర్​ స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ అనే మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీని బేస్ స్టైల్ వేరియంట్ రూ. 9.78 లక్షలు, 'షార్ప్' టాప్ వేరియంట్ రూ. 16.78 లక్షల వద్ద అందుబాటులో ఉంటుంది.

ఎంజీ ఆస్టర్​ ఫీచర్లు

ఎంజీ ఆస్టర్​లో అనేక అధునాతన ఫీచర్లను జోడించింది. ఇందులోని ఆర్టిఫీర్టిషియల్ ఇంటెలిజెన్సీ.. వికీపీడియా ఆధారంగా సమాచారం, వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. అదే సమయంలో లోపల కూర్చున్న వ్యక్తులకు ఎంటర్​టైన్​మెంట్​ కూడా ఇస్తుంది. ఎంజీ ఆస్టర్​లో అటానమస్ లెవెల్-2 టెక్నాలజీ కూడా ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ఇప్పటివరకు ఏ ఇతర కారులోనూ లేదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్​గా మీ కారును కంట్రోల్ చేస్తుంది. ఈ టెక్నాలజీలతో పాటు అడాప్టివిటీ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, కొలిజెన్​ అలర్ట్​, ఇంటెలిజెంట్ హెడ్​ల్యాంప్ కంట్రోల్, వెనుక డ్రైవ్ అసిస్ట్, స్ట్లేన్ ఫంక్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్​ వంటి అనేక అధునాతన ఫీచర్లను అందించింది.

ఆస్టర్​ ఎస్​యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 220 టర్బో, 1349 సిసి (1.3 లీటర్) టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్​పి పవర్​, 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్​తో వస్తుంది. ఇక, దీనిలో​ 1498 సిసి (1.5 లీటర్) న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్​ను కూడా చేర్చింది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్​పీ పవర్, 144 న్యూటన్ మీటర్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.
Published by:Krishna Adithya
First published: