హోమ్ /వార్తలు /బిజినెస్ /

దీపావళి ముగిసినా ఆఫర్ల పండుగ కొనసాగుతోంది... MG Motors అందిస్తున్న డిస్కౌంట్స్ ఇవే

దీపావళి ముగిసినా ఆఫర్ల పండుగ కొనసాగుతోంది... MG Motors అందిస్తున్న డిస్కౌంట్స్ ఇవే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

దీపావళి పండుగ ముగిసిన తర్వాత కూడా ఆటోమొబైల్ కంపెనీలు కార్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఎంజీ మోటార్స్ అందిస్తున్న ఆఫర్స్ తెలుసుకోండి.

ఎంజీ మోటార్స్ సంస్థ గతేడాది భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. మన దేశంలో ఆ సంస్థ నుంచి విడుదలైన మొదటి వాహనం హెక్టార్‌ (Hector). తాజాగా ఈ కార్ల తయారీ సంస్థ హెక్టార్, హెక్టార్ ప్లస్, జెడ్ఎస్ EV, గ్లోస్టర్... వంటి నాలుగు మోడళ్లను అమ్ముతోంది. ఎంజీ మోటార్స్ ఇండియా 2019 జూన్ లో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి, గత నెలలోనే అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్ సందర్భంగా మొత్తం 3,625 యూనిట్ల హెక్టార్, హెక్టార్ ప్లస్, జెడ్ఎస్ ఈవీలను ఆ సంస్థ అమ్మగలిగింది. ఎంజీ బ్రాండ్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. పండుగ డిస్కౌంట్లు లేకుండా, వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ చాలా మంది వినియోగదారులు ఈ బ్రాండ్‌ కార్లను ఎంచుకున్నారు. కానీ ప్రస్తుతం వీటికి డిమాండ్ తగ్గుతోందని గుర్తించిన ఆ సంస్థ, వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. భారతదేశంలో అడుగుపెట్టిన తరువాత మొదటిసారి ఎంజీ మోటార్స్ డిస్కౌంట్లు, ప్రయోజనాలను అందించనుంది. ఎంజీ హెక్టార్, హెక్టార్ ప్లస్, జెడ్‌ఎస్ ఈవీ మోడళ్లను ఇప్పుడు తక్కువ ధరల్లోనే వినియోగదారులు పొందవచ్చు. ఈ ఆఫర్లు గ్లోస్టర్ మోడళ్లపై ఉండవు. ఈ తగ్గింపులన్నీ కొన్ని వేరియంట్లపై మాత్రమే, అదికూడా డీలర్‌షిప్‌లలో లభించే స్టాక్‌పై ఆధారపడి ఉంటాయి.

LIC Jeevan Labh policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ మీ సొంతం

WhatsApp Payments: రిజిస్టర్ నుంచి ట్రాన్సాక్షన్ వరకు... వాట్సప్ పేమెంట్స్‌లో మీ సందేహాలకు సమాధానాలు ఇవే

ఎంజీ హెక్టార్, హెక్టార్ ప్లస్


హెక్టార్, హెక్టార్ ప్లస్ వేరియంట్లపై కస్టమర్లు రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. దీంతో పాటు మూడేళ్ల యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC)ను ఉచితంగా అందిస్తారు. వాహనాలు డెలివరీ చేసిన తేదీ నుంచి మూడేళ్లపాటు AMC ద్వారా ఉచితంగా బేసిక్ సర్వీస్‌లను వినియోగదారులు పొందవచ్చు.

Aadhaar-PAN: మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేయండి ఇలా

SBI Credit Card: గుడ్ న్యూస్... ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తీసుకునేవారికి రూ.6500 బెనిఫిట్స్

ఎంజీ మోటార్స్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎమ్‌జీ జెడ్‌ఎస్. దీనిపై ఇప్పుడు రూ.40,000 డిస్కౌంట్, రూ.25 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, మూడేళ్ల వరకు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్‌ను వినియోగదారులు పొందవచ్చు. ఎంజీ మోటార్స్ నుంచి భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో జెడ్‌ఎస్ ఈవీ మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో దీన్ని లాంచ్ చేశారు. అప్పట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీ దాని బుకింగ్‌లను కొంతకాలం వరకు ఆపేసింది. కొద్ది రోజుల్లోనే బుకింగ్‌లు 2,800 యూనిట్లను దాటాయి. ఈ బుకింగ్‌ల డెలివరీలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆఫర్‌లు ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై మాత్రమే చెల్లుతాయని ఎంజీ మోటార్స్ ప్రకటించింది. ఆఫర్లు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండవచ్చు. కచ్చితమైన డిస్కౌంట్లు, ప్రయోజనాల కోసం స్థానిక డీలర్లను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

First published:

Tags: Automobiles, CAR, Cars, Diwali 2020

ఉత్తమ కథలు