హోమ్ /వార్తలు /బిజినెస్ /

2022 MG Gloster: ఇండియాలో 2022 MG గ్లోస్టర్ లాంచ్.. బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన SUV.. ధర ఎంతంటే..

2022 MG Gloster: ఇండియాలో 2022 MG గ్లోస్టర్ లాంచ్.. బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన SUV.. ధర ఎంతంటే..

2022 MG Gloster (PC : MG Motors)

2022 MG Gloster (PC : MG Motors)

2022 MG Gloster: భారతదేశపు మొట్టమొదటి అటానమస్(లెవల్ 1) SUVగా పేరొందిన 2022 ఎంజీ గ్లోస్టర్ ఇప్పుడు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS)తో పాటు ఇతర హై రేంజ్ ఫీచర్లతో వస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బ్రిటీష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజీ మోటార్ (MG Motor) నుంచి ఇండియా (India)లో మరో కొత్త వెహికల్‌ లాంచ్ అయింది. ఈ కంపెనీ ఎంజీ గ్లోస్టర్ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను (2022 MG Gloster) మన దేశంలో రిలీజ్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి అటానమస్(లెవల్ 1) SUVగా పేరొందిన 2022 ఎంజీ గ్లోస్టర్ ఇప్పుడు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS)తో పాటు ఇతర హై రేంజ్ ఫీచర్లతో వస్తుంది. హై రేంజ్ స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ ప్రత్యేకతలు చూద్దాం.
* ధర, ఇంటీరియర్
MG గ్లోస్టర్ 2022 ఎడిషన్ ఎస్‌యూవీ ధర మన దేశంలో రూ.31.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. పాత వేరియంట్‌తో పోలిస్తే దీంట్లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కంపెనీ అందించింది. 2020లో లాంచ్‌ అయిన బేస్ మోడల్‌లోని ఇంటీరియర్, లేఅవుట్ డిజైన్ ఇప్పుడు మారలేదు. కానీ అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను ఎంజీ అప్‌డేట్ చేసింది. ఈ వెహికల్ సిక్స్‌ సీట్స్‌, సెవెన్‌ సీట్స్‌ ఆప్షన్‌లలో, 6-ట్రిమ్ లెవల్స్‌ డీజిల్ పవర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. 2022 ఎంజీ గ్లోస్టర్‌.. డీప్ గోల్డెన్(ఆన్‌ న్యూ), మెటల్ బ్లాక్, మెటల్ యాష్, వార్మ్ వైట్ అనే నాలుగు కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది.
* టాప్ ఫీచర్లు ఇవే..
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్‌ కార్ ప్లే సపోర్ట్‌తో 31.2 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఈ వెహికల్ సొంతం. గ్లోస్టర్ 4WD వేరియంట్‌లు బ్రిటిష్ విండ్‌మిల్ టర్బైన్-థీమ్ అల్లాయ్ వీల్స్‌తో వస్తాయి.


7 మోడ్స్‌ ఉండే ఆల్-టెర్రైన్ సిస్టమ్, డ్యూయల్ పనోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12-వే పవర్ అడ్జస్ట్ డ్రైవర్ సీటు, డ్రైవర్ సీట్ మసాజ్, వెంటిలేషన్ ఫీచర్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి ఈ SUVలో బెస్ట్ ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. 2022 ఎంజీ గ్లోస్టర్ 2.0L ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 212 bhp టాప్ పవర్‌ను అందిస్తుంది. ఇంజిన్ 2WD, 4WD వేరియంట్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
* బెస్ట్ సేఫ్టీ ఫీచర్లు
డోర్ ఓపెన్ వార్నింగ్ (DOW), రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్(RCTA), లేన్ చేంజ్ అసిస్ట్ (LCA) వంటి అనేక ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ADAS సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు రిలీజ్ అయింది. SUVలో దాదాపు 30+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి : ఆ బ్యాంకుల్లో ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ.. తాజా రేట్లను చెక్ చేయండి..
* కనెక్టివిటీ ఆప్షన్స్ ఇవే..
2022 MG గ్లోస్టర్ వెహికల్‌లో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ షార్ట్‌పీడియా న్యూస్ యాప్, వాయిస్ కమాండ్‌ల ద్వారా గానా సాంగ్ సెర్చ్ ఆప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12-స్పీకర్ ఆడియో సిస్టమ్‌, 75కి పైగా కనెక్ట్ అయిన కార్ ఫీచర్‌లతో i-SMART యాప్ తాజా వెర్షన్‌ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ కారు కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
* బోల్డ్, లగ్జరీ ఎస్‌యూవీ
కార్‌ లాంచింగ్‌ గురించి స్పందించారు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా. గ్లోస్టర్ వెహికల్ బోల్డ్, దృఢమైన, వెర్సటైల్‌, లగ్జరీయస్‌గా ప్రసిద్ధి చెందిందని చెప్పారు. టెక్నాలజీ డిస్రప్షన్‌, కాన్‌స్టాంట్‌ ఎవల్యూషన్‌, బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎంజీ మోటార్స్ ప్రాధాన్యత అన్నారు. ఇప్పుడు 2WD, 4WD ట్రిమ్‌లు, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌లు, నెక్స్ట్-జెన్ టెక్నాలజీ, అటానమస్ లెవల్ 1, MY MG షీల్డ్ ప్యాకేజీతో 'అడ్వాన్స్‌డ్ గ్లోస్టర్' రూపొందిందని పేర్కొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, New car, New cars, SUV

ఉత్తమ కథలు