MG Astor Mid-Size SUV: ఎంజీ ఆస్టర్ మిడ్ రేంజ్ ఎస్​యూవీ లాంచ్​.. AI టెక్నాలజీ ఉన్న తొలి కారు

ఎంజీ ఆస్టర్ మిడ్ సైస్ ఎస్‌యూవీ

MG Astor Mid-Size SUV: అటానమస్​లెవల్ 2 ఎంజీ ఆస్టర్ పేరును ప్రముఖ ఎయిర్ బోర్న్ గ్రౌండ్ సర్వేలెన్స్ బాటిల్ ఫీల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రేథియాన్ సెంటినెల్ పేరు ఆధారంగా పెట్టారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ గతంలో యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో ఉపయోగించేవారు

  • Share this:
బ్రిటన్​కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మోరిస్ గ్యారేజెస్ (ఎంజీ)తనలేటెస్ట్ క్రియేషన్ ఎంజీ ఆస్టర్ మిడ్​రేంజ్​ ఎస్​యూవీకారును లాంచ్​చేసింది. దీనిలో అత్యాధునిక టెక్నాలజీని అందించింది. అటానమస్​లెవల్ 2 టెక్నాలజీ,పర్సనల్ ఏఐ అసిస్టెంట్ వంటి అప్​డేటెడ్​ఫీచర్లను అందించడం విశేషం. ఈ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ)అసిస్టెంట్ టెక్నాలజీనిఅమెరికాకుచెందినస్టార్ డిజైన్ అనే సంస్థ రూపొందించింది.ఈ ఏఐ అసిస్టెంట్కారులోని లేటెస్ట్​ టెక్నాలజీప్యాసెంజర్లను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇది మనిషిలాగే గొంతులు, ఎమోషన్స్ అన్నింటినీ వ్యక్తం చేస్తుంది. అంతే కాదు.. వికీపీడియా సహాయంతో మనం అడిగిన సమాచారాన్ని కూడా అందిస్తుంది.

“ఆస్టర్కారును లేటెస్ట్​ టెక్నాలజీతో డిజైన్​ చేశాం. ఇండస్ట్రీలో ఇలాంటి లేటెస్ట్​ టెక్నాలజీకారు రావడం ఇదేమొదటిసారి. సాధారణంగా లగ్జరీ సెగ్మెంట్​ కార్లలోకనిపించే బెస్ట్ ఫీచర్స్ ఇందులో కనిపిస్తాయి. మేం ఎప్పుడూ కస్టమర్లకు మెరుగైన ఫీచర్లు అందించేందుకు ప్రయత్నిస్తాం. అందుకే, ఈసారి మేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనిఎంచుకున్నాం. ఏఐ వల్ల మన కారు స్మార్ట్, సేఫ్ వాతావరణాన్ని అందిస్తుంది” అంటూ ఎంజీ మోటార్స్ ఇండియా సెగ్మెంట్ ఎండీ రాజీవ్ ఛాబా పేర్కొన్నారు.

అటానమస్​లెవల్ 2 ఎంజీ ఆస్టర్ పేరును ప్రముఖ ఎయిర్ బోర్న్ గ్రౌండ్ సర్వేలెన్స్ బాటిల్ ఫీల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రేథియాన్ సెంటినెల్ పేరు ఆధారంగా పెట్టారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ గతంలో యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో ఉపయోగించేవారు. ఈ కారులో ఏఐతో పాటు మిడ్ రేంజ్ రాడార్, మల్టీ పర్పస్ కెమెరా, అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లను అందించింది. ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, రేర్ డ్రైవ్ అసిస్ట్, ఇంటలిజెంట్ హెడ్ లాంప్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా చేర్చింది.ఈ ఫీచర్లన్నీ సేఫ్టీ, కంఫర్ట్ ని అందించడంతో పాటు మీకు మెరుగైనడ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. భారతీయ రోడ్లపై ఉన్న ట్రాఫిక్ లోని నడపడానికి ఈ కారు అనువుగా ఉంటుంది.

కాన్సెప్ట్ కార్ ఆజ్ ఏ ప్లాట్ ఫాం (CAAP) అనే కొత్త కార్​ సర్వీసుల్లో భాగంగా దీన్ని ఆవిష్కరించింది. ప్రయాణీకులకు అద్భుతమైన ఎక్స్​పీరియన్స్​ అందించడమే ఈ మిడ్ సైజ్ ఎస్​యూవీ కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ఇన్ కార్ సర్వీసెస్‌ని కూడా అందిస్తోంది. మరోవైపు మ్యాప్ మై ఇండియా, జియో కనెక్టివిటీ, బ్లాక్ చెయిన్ ప్రొటెక్టెడ్ డిజిటల్ పాస్ పోర్ట్, జియో సావన్ సబ్ స్క్రిప్షన్, బుకింగ్ పార్కింగ్ స్లాట్, ఇతర ఫీచర్లు కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఇది కూడా చదవండి:

Facebook Indifi: ఫేస్‌బుక్ కొత్త సర్వీస్... 5 రోజుల్లో రూ.50 లక్షల వరకు లోన్
Published by:Shiva Kumar Addula
First published: