MG Astor: మార్కెట్​లోకి ఎంజీ ఆస్టర్ మిడ్-సైజ్ ఎస్​యూవీ లాంచ్​.. ఏఐ టెక్నాలజీతో రూపొందిన మొట్టమొదటి కారు

MG Astor

ఇప్పటికే ఎంజీ సంస్థ నుంచి హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్, జెడ్ఎస్ ఈవీ మోడల్స్ విడుదలయ్యాయి. వీటి సరసన ఐదవ మోడల్​గా ఎంజీ ఆస్టర్ విడుదలైంది. వచ్చే వారం నుంచి ఇది డీలర్షిప్ సెంటర్లలో టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో సెప్టెంబర్ 19 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

  • Share this:
బ్రిటన్​కు చెందిన ఆటోమొబైల్​ దిగ్గజం ఎంజీ మోటార్స్​ సరికొత్త ఆస్టర్ మిడ్-సైజ్ ఎస్​యూవీ కారును భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. వాహన ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ ఫ్యూచరిస్టిక్​ ఎస్​యూవీని ఆధునిక ఫీచర్లు, ఆకర్షనీయమైన డిజైన్​తో రూపొందించింది.​ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) టెక్నాలజీతో రూపొందిన మొట్టమొదటి కారు ఇదే కావడం విశేషం. ఈ ఏఐ టెక్నాలజీ కారులోని ప్రయాణీకులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది. ఇప్పటికే ఎంజీ సంస్థ నుంచి హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్, జెడ్ఎస్ ఈవీ మోడల్స్ విడుదలయ్యాయి. వీటి సరసన ఐదవ మోడల్​గా ఎంజీ ఆస్టర్ విడుదలైంది. వచ్చే వారం నుంచి ఇది డీలర్షిప్ సెంటర్లలో టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో సెప్టెంబర్ 19 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్​ 19 నుంచి బుకింగ్స్​ షూరూ..

ఈ కారు డాష్​బోర్డ్​లో 10.1 అంగుళాల టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​ ఉంటుంది. ఇది జియో ఇ–సిమ్​ కనెక్ట్ సదుపాయంతో వస్తుంది. ఇందులోని ఏఐ టెక్నాలజీ మనం చెప్పే ఆన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ కారు హెడ్​ టర్నర్​, వికీపీడియా, జోక్స్​, న్యూస్​, ఎమోజి, చిట్​ చాట్​, ఫెస్విల్లే గిఫ్ట్​, నావిగేషన్​, మ్యూజిక్​, కార్​ కంట్రోల్స్​, కార్​ వార్నింగ్​ క్రిటికల్​ వంటి ఫీచర్లకు మద్దతిస్తుంది. ఇది 80 కంటే ఎక్కువ ఇంటర్నెట్​ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆస్టర్​లో భద్రతకు సంబంధించిన అనేక ఫీచర్లను చేర్చింది. లెవల్ -2 అటానమస్ సిస్టమ్ ప్యాకేజీలో మిడ్-రేంజ్ రాడార్‌లు, డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ల శ్రేణిని గుర్తించగల మల్టీ-పెర్ఫార్మెన్స్ కెమెరాలను దీనిలో అందించింది. మరోవైపు, క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలీజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్ (IHC), రియర్ డ్రైవ్ అసిస్ట్ (RDA), స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అదునాతన ఫీచర్లను చేర్చింది. అలాగే, కస్టమర్లు జియో సావన్​ యాప్​ ద్వారా సంగీతాన్ని యాక్సెస్ చేసుకునే సదుపాయం కల్పించింది. పార్క్ ప్లస్​ ఫంక్షన్ ద్వారా పార్కింగ్ స్థలాన్ని రిజర్వ్ చేసుకునేలా డిజైన్​ చేసింది. ఈ ఎస్​యూవీ మొత్తం రెండు పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్లలో వస్తుంది. ఇది 1.5 -లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 1.3- లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్లు అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published: