#MeToo: దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో 588 వేధింపుల ఫిర్యాదులు

దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో అత్యధికంగా ఐటీ కంపెనీల్లో లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: October 15, 2018, 6:50 PM IST
#MeToo: దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో 588 వేధింపుల ఫిర్యాదులు
ప్రతీకాత్మక చిత్రం..
news18-telugu
Updated: October 15, 2018, 6:50 PM IST
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీ టూ’ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో ప్రముఖుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు ఇది కార్పొరేట్ రంగాన్ని కూడే కుదిపేస్తోంది. టాటా మోటార్స్‌లో సీనియర్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావంతో ఆ సంస్థ విచారణకు ఆదేశించింది. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో కార్పొరేట్ రంగంలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై బహిరంగ చర్చ జరుగుతోంది. అయితే ఇదేమీ కొత్త కాదని, గతంలోనూ దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులు భారీ సంఖ్యలోనే నమోదైనట్లు మనీకంట్రోల్.కామ్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.

నిఫ్టీలో లిస్టింగ్‌ అయిన కంపెనీల్లో గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 588 లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయి. అత్యధికంగా ఐటీ రంగంలో అత్యధికంగా 244 లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క విప్రో సంస్థలో మాత్రమే 101 వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయి. మిగిలిన రంగాలతో పోల్చితే ఐటీ రంగంలో మహిళలు ఎక్కువ అయినందునే...ఐటీ రంగంలో లైంగిక వేధింపుల కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


విప్రో తర్వాతటి స్థానంలో...99 వేధింపుల కేసులతో ఐసీఐసీఐ బ్యాంకు రెండో స్థానంలో నిలుస్తోంది. ఆ  తర్వాతటి స్థానంలో ఇన్ఫోసిస్(77), టీసీఎస్(62), యాక్సిస్ బ్యాంకు(47) బ్యాంకులు ఉన్నాయి.



నిఫ్టీ లిస్టెడ్ కంపెనీల్లో నమోదైన లైంగిక వేధింపుల కేసుల వివరాలు ఈ దిగువున చూడొచ్చు.

దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో నమోదైన లైంగిక వేధింపుల కేసుల వివరాలు
దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో నమోదైన లైంగిక వేధింపుల కేసుల వివరాలు


ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల శాతం 30 శాతం కంటే తక్కువ కావడంతో అక్కడ లైంగిక వేధింపుల కేసులు కూడా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్న సదరు కంపెనీలు...ఆ మేరకు సంబంధిత కేసులను పరిష్కరిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు నుంచి నాలుగు శాతం ఫిర్యాదులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు ఆ సంస్థలు తెలిపాయి.
Loading...
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


ఉద్యోగినులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఇప్పటికే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తమ సంస్థల్లో పనిచేసే వారిపై కేవలం ఉద్యోగులు మాత్రమే కాకుండా...తాత్కాలిక ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ చేసే ఉద్యోగులు నుంచి కూడా లైంగిక వేధింపుల ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గతంలో పోల్చితే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసే ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి.
First published: October 15, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...