news18-telugu
Updated: October 12, 2018, 6:17 PM IST
టాటా మోటార్స్
భారత మీడియా రంగాన్ని కుదిపేస్తున్న #మీ టూ ఉద్యమం కార్పొరేట్ రంగాన్ని కూడా వదిలేటట్లు లేదు. తాజాగా #మీ టూ ఉద్యమం సుడిగుండంలో టాటా మోటార్స్ చిక్కుకుంది. టాటా మోటార్స్ కార్పొరేట్ కమ్యునికేషన్స్ చీఫ్ సురేశ్ రంగరాజన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు రావడం కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. సురేశ్ రంగరాజన్ మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ వెలిశాయి. దీంతో ట్వట్టర్లో ఈ కామెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ చక్కర్లు కొట్టాయి.
సురేశ్ రంగరాజన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందినట్లు స్వయంగా టాటా మోటార్స్ ఓ ప్రకటనలో ధృవీకరించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టిసారించినట్లు వెల్లడించింది.
Published by:
Janardhan V
First published:
October 12, 2018, 5:24 PM IST