METAVERSE WHAT IS THE NEXT GENERATION OF INTERNET ZUCKERBERG AND NADELLA ARE TALKING ABOUT MK GH
What is Metaverse : మెటావెర్స్తో సరికొత్త సాంకేతిక విప్లవం... ఇంటర్నెట్ను మించి ఉపయోగాలు.. పూర్తి వివరాలివే!
ప్రతీకాత్మకచిత్రం
మెటావెర్స్ గురించి స్థూలంగా చెప్పాలంటే... మొబైల్ ఇంటర్నెట్కి ఇది సక్సెసర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్తో చేస్తున్న పనులను మించి ఈ మెటావెర్స్ టెక్నాలజీతో పనులు చేయవచ్చు. రియల్‌టైమ్‌లో మిత్రులతో వర్చువల్‌గా డ్యాన్స్‌లు చేయడం, పార్టీలు చేసుకోవడం లాంటివి దీనితో సాధ్యమవుతాయి.
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ట్వీట్లో‘మెటావెర్స్’ అనే ఓ కొత్త పేరు వాడి కొత్త రకం సాంకేతికత గురించి ప్రస్తావించారు. సోషల్ నెట్వర్క్ ట్రన్స్ఫార్మింగ్ గురించి చెబుతూ ఆయన ఈ మాట అన్నారు. మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్) ని ఇంటర్నెట్తో ఇంటిగ్రేట్ చేయడమే ఈ పదానికి అర్థమని ఆయన పేర్కొన్నారు. అయితే, కొన్ని అగ్ర టెక్ కంపెనీలు ఇప్పటికే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగాపనులుమొదలుపెట్టాయి.అసలేంటీ మెటావెర్స్ అనేది ఇప్పుడు చూద్దాం!
మెటావెర్స్ గురించి స్థూలంగా చెప్పాలంటే... మొబైల్ ఇంటర్నెట్కి ఇది సక్సెసర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్తో చేస్తున్న పనులను మించి ఈ మెటావెర్స్ టెక్నాలజీతో పనులు చేయవచ్చు. రియల్‌టైమ్‌లో మిత్రులతో వర్చువల్‌గా డ్యాన్స్‌లు చేయడం, పార్టీలు చేసుకోవడం లాంటివి దీనితో సాధ్యమవుతాయి. ఇప్పటికే ఫేస్బుక్ ఈ సాంకేతికతతో ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది.యాప్స్, ఫోన్స్, కంప్యూటర్లు, ఎంఆర్ గ్యాడ్జెట్స్‌లో ఫేస్బుక్ తీసుకొస్తున్న మెటావెర్స్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. జుకర్ బర్గ్ మాత్రమే కాదుమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇటీవల మెటావెర్స్ గురించి ప్రస్తావించారు. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను దీని ద్వారా మరింతగా ప్రజల చేరువ చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు మెటావెర్స్ అంటే ఎంఆర్+ ఇంటర్నట్ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఆర్ను టెక్ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. ఇదేదో కొత్త టెక్నాలజీకూడా కాదని, ఆగ్యుమెంటడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్)ల కలయికే ఈ మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్) అని స్పష్టం చేశారు. దానిని ప్రస్తుత ఇంటర్నెట్కు ఇంటిగ్రేట్ చేసి మెటావెర్స్ ను రూపొందిస్తున్నారు.
అయితే మెటావెర్స్కు అవసరమయ్యే ఎకో సిస్టమ్‌ను ఒకే సంస్థ రూపొందించడం అంత సులభం కాదు. దీని కోసం ఏళ్ల తరబడి పరిశోధనజరగాల్సి ఉంటుంది. అందుకే కొన్ని టెక్ దిగ్గజాలు కలసి మెటావెర్స్ను తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కంటెంట్... ఇలా పంచుకొని మెటావెర్స్ను రూపొందించనున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ లాంటివి పనులు ప్రారంభించాయి. అయితే, దీనికిసెన్సార్షిప్తో పాటు కమ్యూనికేషన్ కంట్రోల్, ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులేటరీ, ట్యాక్స్ రిపోర్టింగ్, ఆన్లైన్ రేడికలైజేషన్ లాంటివి అవసరం అవుతాయి. ఇవన్నీ సిద్ధం చేసి మెటావెర్స్ టెక్నాలజీ త్వరలోనే తీసుకురానున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.