#జర భద్రం: ఐటీఆర్ రీఫండ్ మెసేజ్ వచ్చిందా?

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 వరకు గడువు ఉండేది. కానీ ఐటీ డిపార్ట్‌మెంట్ ఆ గడువును ఆగస్ట్ 31 వరకు పెంచింది. ఈ గడువు పెంపు ట్యాక్స్‌ పేయర్స్‌కు మేలు చేస్తుందో లేదో కానీ... సైబర్ నేరగాళ్లు మాత్రం బాగా వాడుకుంటున్నారు. అప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారిని ట్రాప్ చేస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ చేస్తామని ఎస్ఎంఎస్‌లు పంపి జనాన్ని ముంచేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

news18-telugu
Updated: August 29, 2018, 4:44 PM IST
#జర భద్రం: ఐటీఆర్ రీఫండ్ మెసేజ్ వచ్చిందా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన కొన్ని రోజులకే రీఫండ్‌ వచ్చిందని, బ్యాంకు వివరాలు తెలపాలని ఏదైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ-ఇన్)'. మీకు రీఫండ్ అప్రూవ్ అయింది అంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఎస్ఎంఎస్‌లు పంపి వ్యక్తిగత వివరాలు కాజేస్తున్నారని హెచ్చరించింది. ఇలాంటి సందేశాలు తమకు వస్తున్నాయని ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఇప్పుడు 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' కూడా అప్రమత్తం చేస్తోంది. ఇలాంటి ఎస్ఎంఎస్, ఇ-మెయిల్స్‌లో ఉండే లింక్స్‌పై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుందని, వాటిని "డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెడతారు" అని హెచ్చరిస్తోంది. ఇ-ఫైలింగ్ వివరాలను దుర్వినియోగం చేసి ఐటీ డిపార్ట్‌మెంట్ రికార్డ్స్‌ను మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Income Tax Return, ITR, phishing e-mails, phishing sms, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్, ఐటీఆర్, ఫిషింగ్ ఇ-మెయిల్స్, ఫిషింగ్ ఎస్ఎంఎస్

ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేసేవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఫేక్ ఎస్ఎంఎస్‌లు వస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. bit.ly, goo.gl, ow.ly, t.co లాంటి యూఆర్ఎల్ షార్టెనర్స్‌తో ఫిషింగ్ లింక్స్ పంపిస్తున్నారు. మీకు ఫలానా మొత్తం రీఫండ్ వస్తుంది. మీరు నమోదు చేసిన బ్యాంకు అకౌంట్ వివరాలు తప్పుగా చూపిస్తున్నాయి. ఈ లింక్ క్లిక్‌ చేసి సరైన వివరాలు అప్‌లోడ్ చేయండి అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిని క్లిక్ చేస్తే ఫిషింగ్ వెబ్‌సైట్లు ఓపెన్ అవుతాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లాగే ఉంటాయి ఆ వెబ్‌సైట్లు.
సీఈఆర్‌టీ-ఇన్


ఇలాంటి వెబ్‌సైట్లలో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు అప్‌లోడ్ చేస్తే యూజర్లు చిక్కుల్లో పడ్డట్టే. అవి సైబర్ క్రిమినల్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి లింక్స్ వస్తే ఏం చేయాలో సూచనలు కూడా జారీ చేశారు నిపుణులు.

- ట్యాక్స్ రీఫండ్ పేరుతో వచ్చే ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్స్ పట్టించుకోవద్దు.
- పొరపాటున కూడా అలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు.

- అలాంటి ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్స్‌లో స్పెల్లింగ్‌తో పాటు వ్యాకరణ దోషాలుంటాయి కాబట్టి వాటిని గుర్తించొచ్చు.
- మీకు తెలిసినవారి నుంచి అలాంటి ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్స్‌ వచ్చినా పట్టించుకోకపోవడం మంచిది.
- బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ వివరాల్లాంటి మీ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని అస్సలు ఎంటర్ చేయొద్దు.
- ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులెవరూ వ్యక్తిగత వివరాలు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల సమాచారం, పాస్‌వర్డ్, పిన్, ఓటీపీ లాంటివి అడగరు.
- కంప్యూటర్, మొబైల్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఫైర్‌వాల్ ఉపయోగించాలి.
- మళ్లీ మళ్లీ అలాంటి ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్స్‌ వస్తే phishing@incometax.gov.in ఇ-మెయిల్‌కు ఫార్వర్డ్ చేయొచ్చు.
- ఓ కాపీని incident@cert-in.org.in కు కూడా పంపాలి. ఫార్వర్డ్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఇ-మెయిల్ డిలిట్ చేయండి.

ఇవి కూడా చదవండి:

ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారా? ఇది మీకోసమే!

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్: 10 లాభాలు

ఆదాయపు పన్ను తగ్గించుకోవాలా? ఇలా చేయండి!

ఐటీ రిటర్న్స్‌: ఈ 10 టిప్స్ మీకోసమే!

Photos: ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారా? ఈ 5 మర్చిపోకండి!
Published by: Santhosh Kumar S
First published: August 29, 2018, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading