ఆన్‌లైన్‌లో డిస్కౌంట్స్‌ ఇక ఉండవా?

ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్స్ పొందేవారికి ఇది బ్యాడ్ న్యూసే. స్థానిక వ్యాపారులకు నష్టాలను మిగులుస్తున్న అలాంటి డిస్కౌంట్ ఆఫర్లకు చెక్ చెబుతోంది ప్రభుత్వం.

news18-telugu
Updated: July 31, 2018, 2:56 PM IST
ఆన్‌లైన్‌లో డిస్కౌంట్స్‌ ఇక ఉండవా?
ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్స్ పొందేవారికి ఇది బ్యాడ్ న్యూసే. స్థానిక వ్యాపారులకు నష్టాలను మిగులుస్తున్న అలాంటి డిస్కౌంట్ ఆఫర్లకు చెక్ చెబుతోంది ప్రభుత్వం.
  • Share this:
మీరు ఓ వాచ్ కొందామనుకుంటారు. బయట మార్కెట్‌లో ఓ రేటుంటుంది. అమెజాన్‌లో ఒక రేటుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మరో రేటుంటుంది. ఇలా ఒక్కో చోట ఒక్కో ధర ఉంటే... ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ లభిస్తే అక్కడ మీరు కొంటారు. ఇలా ధరల్లో తేడా ఉండటానికి పోటీనే కారణం. ఇకపై ఇలాంటి భారీ ఆఫర్లు ఉండవు. ఎందుకంటే ఈ ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకొస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇ-కామర్స్ పాలసీ ముసాయిదా ప్రకారం ఇలాంటి డిస్కౌంట్లకు తెరపడనుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ షాపింగ్ సైట్స్ మాత్రమే కాదు... ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ, జొమాటోతో పాటు పేటీఎం, అర్బన్‌క్లాప్, పాలసీబజార్ లాంటి వాటికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. డేటా ప్రైవసీపై జస్టిస్ శ్రీక్రిష్ణ కమిటీ సిఫార్సులతో పాటు ఇ-కామర్స్ పాలసీని అమలు చేస్తారు.

"డేటా ఫ్లో, ప్రొటెక్షన్, సమస్యల పరిష్కారం, డేటా పరిరక్షణ లాంటి అంశాలపై పలువురి నుంచి సమగ్రమైన సిఫార్సులు తీసుకొని ఇ-కామర్స్ పాలసీ రూపొందించాం. ఇందులోనే నియంత్రణ విధానాల గురించి సిఫార్సులున్నాయి. ఈ ముసాయిదాను అమల్లోకి తీసుకొచ్చేందుకు గడువు విధించలేదు కానీ... త్వరలోనే ఇ-కామర్స్ పాలసీకి తుదిరూపు తీసుకొచ్చి అమలు చేస్తాం."

అనూప్ వాధవాన్, కామర్స్ సెక్రెటరీ
ప్రస్తుతం ఇ-కామర్స్ రంగంలో ఉల్లంఘనలపై ప్రత్యేకంగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలన్న సిఫార్సు కూడా ఇందులో ఉంది. బీ2సీ ఇ-కామర్స్‌లో 49 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వాలని సూచించింది. ఇ-కామర్స్ పాలసీ అమల్లోకి వస్తే స్థానిక వ్యాపారులకు చాలా మేలు. ఎందుకంటే ఇ-కామర్స్ వెబ్‌సైట్లల్లో భారీ ఆఫర్లతో స్థానిక వ్యాపారులకు ఇంతకాలం నష్టాలు తప్పలేదు. ఇప్పుడు ధరలను నియంత్రించడం, వందశాతం భారతీయ ఉత్పత్తుల్నే అమ్మేలా ప్రోత్సహించడం లాంటి మార్పులతో స్థానిక వ్యాపారులకు ఊరట లభించినట్టే.
First published: July 31, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading