20 ఏళ్ల వయసు లోపు ఉన్న ఆరుగురు విద్యార్థులను యోనో ఎస్బీఐ 20 అండర్ 20 అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. ఆగరసోనీ శ్రీధరన్, MD మైక్రోసాఫ్ట్ ఇండియా, మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యొక్క MD, దిలీప్ అస్సేతో కూడిన జ్యూరీ వీరిని ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది.
"బహిరంగ ఓటింగ్ కోసం ఉంచిన ఈ జాబితాలోని పేర్లను ఎంపిక చేసేందుకు జ్యూరీ వివరణాత్మక విశ్లేషణ చేపట్టింది. చిన్న వయస్సు నుంచి ఆవిష్కరణ ప్రోత్సహించబడిందని మేము నమ్ముతున్నాము. చక్కని ప్రతిభతో దూసుకుపోతున్న వీరిని ప్రొత్సహించేందుకు యోనో చేస్తున్న కార్యక్రమాన్ని మేం అభినందిస్తున్నాం” అని దిలీప్ ఆస్బే అన్నారు. తమ ఫేవరెట్ అభ్యర్థులకు అందరూ ఓటు వేయాలని ఆయన కోరారు.
CIA వరల్డ్ ట్రేడ్-బుక్ విడుదల చేసిన భారత జనాభా వివరాలు 2018 ప్రకారం, భారతదేశంలోని 27.34% జనాభా 14 సంవత్సరాలలోపు వయసు వాళ్లే. 24 సంవత్సరాల వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు 45 శాతం మంది ఉంటారని యోనో ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్ యొక్క భవిష్యత్తు ఎక్కువగా యువ విద్యార్ధి జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా కొత్త మార్గాన్ని చూపించే క్రమంలో యోనో ఎస్బీఐ 20 అండర్ 20 అవార్డ్ కోసం పలువురిని ఎంపిక చేసింది.
"
బహిరంగ ఓటింగ్ కోసం ఉంచిన ఈ జాబితాలోని పేర్లను ఎంపిక చేసేందుకు జ్యూరీ వివరణాత్మక విశ్లేషణ చేపట్టింది. చిన్న వయస్సు నుంచి ఆవిష్కరణ ప్రోత్సహించబడిందని మేము నమ్ముతున్నాము. చక్కని ప్రతిభతో దూసుకుపోతున్న వీరిని ప్రొత్సహించేందుకు యోనో చేస్తున్న కార్యక్రమాన్ని మేం అభినందిస్తున్నాం” అని దిలీప్ ఆస్బే అన్నారు.
బాలికల విభాగంలో నైనా జైస్వాల్, నిఖియా షంషేర్, సుష్మా వర్మను జ్యూరీ ఎంపిక చేసింది. బాలుర విభాగంలో మొహమ్మద్ ఆలీ హసన్, నిషాంత్ అభంగీ, రిఫాత్ షారుఖ్‌ను ఎంపిక చేశారు.హైదరాబాద్ నుంచి 18 ఏళ్ల నైనా జైస్వాల్ పీహెచ్డీ కోసం సిద్ధమవుతోంది. భారతదేశంతో పాటు ఆసియాలోనూ పీజీ పూర్తి చేసిన పిన్న వయస్కురాలిగా నైనా నిలిచింది. కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంశంలోనే కాదు... ఎనిమిదేళ్ల వయసులో పదో తరగతి, పదేళ్ల వయసులో ఇంటర్మీడియట్, పదమూడేళ్ల వయసులో గ్రాడ్యుయేషన్... ఇలా పిన్న వయసులోనే అనేక కోర్సులను నైనా పూర్తి చేసింది.
బెంగళూరు నుంచి ఎంపికైన 16 సంవత్సరాల నిఖియా ఒక రచయిత, సామాజిక కార్యకర్త. ఆమె సైన్స్ లేబొరేటరీలు లేని పాఠశాలలు మరియు కళాశాలల కోసం 106 యెర్న్ టు లెర్న్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తన 'బ్యాగ్స్, బుక్స్, మరియు సప్లైస్' కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయంతో 10,500 మంది విద్యార్థులకు పాఠశాలలో కావాల్సిన వస్తువులను సమకూర్చారు. 25 మంది అంధులైన పిల్లలకు ఆమె స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
లక్నోకు చెందిన 15 ఏళ్ల సుష్మా వర్మ ఎం.ఎస్.సి మైక్రో బయోలాజీ చదివారు. ఆమె పారిశుద్ధ్యం విభాగంలో పని చేసే ఓ ఉద్యోగి కుమార్తె. స్కూల్లో ఎప్పుడూ ప్రథమ ర్యాంకు సాధించే సుష్మా వర్మ జపాన్‌లో జరిగిన IQ టెస్ట్‌కు ఎంపికైంది. అక్కడ కూడా ఆమె ప్రథమ ర్యాంక్ సాధించింది.
హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల మొహమ్మద్ అలీ హసన్ ఇంజనీర్లు కావాలనే వారికి ఎలాంటి ఫీజు తీసుకోకుండా శిక్షణ ఇచ్చారు. రాజ్‌కోట్‌కు చెందిన నిశాంత్ అభాంగి (16) చైల్డ్ ప్రాడిజీ మరియు 13వ ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో బంగారు పతక విజేత. ఆయన భారత రాష్ట్రపతి నుంచి జాతీయ బాల పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల రిఫాత్ షారూఖ్... ప్రపంచంలో తేలికైన మరియు అతిచిన్న ఉపగ్రహం 'కలాసత్'ను రూపొందించారు. ఇది నాసా రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడింది. దీన్ని అంతరిక్ష సంస్థ వాలప్ ఐల్యాండ్ నుండి లిఫ్ట్-ఆఫ్ చేసే వెసులుబాటు ఉంది.
ఈ యువ సాధకులందరికీ అనంతమైన శక్తి మరియు నిర్ణయాత్మకమైన లక్షణాలు ఉన్నాయి. ఇది యోనో ఎస్బీఐ యొక్క డిజిటల్ బ్యాంకు కస్టమర్లతో ప్రతిధ్వనిస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో సొంత సౌలభ్యాన్ని కోరుకునే యువ కస్టమర్ల కోసం యోనో డిజైన్ చేయబడింది.
గమనిక: ఇది స్పాన్సర్ చేయబడిన వ్యాసం, న్యూస్ 18 కంటెంట్ దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.