MEET APPLES NEWEST INVENTION THE APPLE CAR OR APPLES NEW SELF DRIVING CAR MK GH
Apple car: యాపిల్ నుంచి డ్రైవర్‌లెస్ కారు...Teslaకు అమ్మా మొగుడు వచ్చేసింది...షాక్ లో ఎలాన్ మాస్క్..
ఫ్రతీకాత్మకచిత్రం
2014లోనే టైటాన్(Titan) పేరుతో ఎలక్ట్రికల్ కార్ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించిన యాపిల్.. ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి కోసం 1,000 మంది ఉద్యోగుల్ని నియమించింది. అప్పటి నుంచి ఆపిల్ సంస్థ మొదటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడంలో నిమగ్నమైంది.
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్(Apple) సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. 2024 నాటికి సొంతంగా ప్యాసింజర్ కార్లను మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్ల తయారీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు తెలుస్తోంది. నూతనంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ‘టైటాన్’(Titan) అనే పేరు కూడా పెట్టింది. నిజానికి ఆపిల్ సంస్థ తొలిసారి 2014లో సొంతంగా సెల్ఫ్‌డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించింది. అప్పటి నుంచి దీని కోసం ప్రణాళికలు రచిస్తోంది. కాగా ఈ కార్ల కోసం ఆపిల్ తన సొంత కటింగ్ ఎడ్జ్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఆపిల్ తయారు చేస్తున్న ఈ బ్యాటరీలు(batteries) మరింత పొదుపుగా ఉండటమే కాకుండా, వాహనం ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కాగా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్లు (electric car) ఎక్కువగా లిథియం- అయాన్ బ్యాటరీల ద్వారానే పనిచేస్తున్నాయి. అయితే, వాటికి ప్రత్యామ్నాయంగా లిథియం- ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ(lithium-iron phosphate batteries )లతో కార్లను రూపకల్పన చేయాలనే ఆలోచనతో కంపెనీ పనిచేస్తుంది. అందువల్ల, లిథియం అయాన్(lithium-ion batteries) మాదిరిగా కాకుండా తక్కువ వేడిని బహిర్గతం చేసే, దహన ప్రమాదాన్ని తగ్గించే లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను దీనిలో ఉపయోగించాలని చూస్తోంది. వీటితో పాటు, దీని తయారీలో లిడార్ సెన్సార్ల(Lidar sensor)ను వాడనుంది. ఈ సెన్సార్లను ప్రస్తుతం ఐఫోన్ 12 ప్రో(iPhone 12 Pro), ఐప్యాడ్ 12 ప్రో(iPad 12 Pro) మోడళ్ల తయారీలో ఉపయోగిస్తున్నారు.
1,000 మంది ఉద్యోగులతో సాఫ్ట్ వేర్ అభివృద్ధికి ప్రణాళిక..
కాగా, ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆపిల్ తన ప్రీమియం బ్రాండ్ కు తగ్గట్లే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీనే దీనిలో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014లోనే టైటాన్(Titan) పేరుతో ఎలక్ట్రికల్ కార్ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించిన యాపిల్.. ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి కోసం 1,000 మంది ఉద్యోగుల్ని నియమించింది. అప్పటి నుంచి ఆపిల్ సంస్థ మొదటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడంలో నిమగ్నమైంది.
అయితే, కొన్న కారణాలతో అప్పట్లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను యాపిల్ మారోసారి చేపట్టింది. ప్రస్తుతం మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, నూతన టెక్నాలజీతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఉత్పత్తి చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా 2024లో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారు(electric car) ను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏది ఏమైనా ఆపిల్ ఒక్కసారి ఆటోమేటిక్ వాహనాన్ని ప్రవేశపెడితే నిజంగా అది ఆటోమొబైల్ మార్కెట్లో పెను మార్పులకు దారి తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.