పదవీ విరమణ - మనిషి జీవితంలో పదవీ విరమణ అనేది చాల అమూల్యమైన దశ అనే చెప్పుకోవచ్చు, మీ జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ముగించుకొని మరొక సున్నితమైన దశలోకి అడుగుపెట్టే సమయమిది. ఇంచుమించు కళాశాలలో మొదటి రోజు పొందే అనుభూతి మాదిరిగానే, కొంత ఉత్సాహం, ఇంకొంచెం అనిశ్చితి, మరియు ఒత్తిడి అన్ని కలిసిన భావనను పొందుతారు. 60 సంవత్సరాల తరువాత మంచి ఆరోగ్యం, నాణ్యమైన జీవితాన్ని పొందడానికి కొన్ని ముఖ్యమైన ఖర్చులను భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది 80 యేళ్ళ తరువాత కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు కూడా అటువంటి జీవితం కోసం కొంత డబ్బును ఆదా చేయడం అలవరుచుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా మనదేశంలో ప్రజలకోసం ఎటువంటి సామాజిక భద్రత కాని దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ వంటి పథకాలు మనకు అందుబాటులో ఉండవు. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పని చేయనివారికి పదవీ విరమణ చేసిన వెంటనే ఉన్న ఉద్యోగ భీమా కూడా వర్తించదు.
వయోవృద్ధుల ఆరోగ్య భీమ విషయానికి వస్తే అందులో అధిక ప్రీమియంలు, కఠినమైన వైద్య తనిఖీలు,అధిక మొత్తంలో చెల్లింపులు మరియు వెయిటింగ్ పీరియడ్స్ వంటి చాలా పరిమితులు ఉంటాయి. కాబట్టి ద్రవ్యోల్బణ రేటు, వయోవృద్ధులకు సరైన ఆదాయం లేకపోవడం, దంత సమస్యలు, కంటి సంరక్షణ మరియు క్రమంగా చేసే వైద్య పరీక్షలు మరియు ఊహించని అత్యవసర పరిస్థితులపై పెరిగే ఖర్చులను ఎదుర్కోవడానికి మీరు ఏంచేయగలరో చూద్దాం?
మీ పదవీ విరమణ సమయంలో ఇలాంటి ఖర్చులకు మీరు ఎలా సిద్ధంగా ఉండవచ్చనే దానిపై మేము అందించే సూచనలు, పెరుగుతున్న మీ ఆరోగ్య అవసరాలకు తక్కువ ధరలోనే ఎలాంటి ఒత్తిడి లేకుండా సమస్యలు పరిష్కరించడానికి మీకు తోడ్పడుతాయి.
మీ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి మీ పొదుపును పెంచుకోండి.
ఇక్కడ వీలైనంత త్వరగా ఆరోగ్య భీమా తీసుకొనుట ఎంతో ఉత్తమమైన నిర్ణయం. మునుముందుగా ఈ ఆరోగ్య భీమా తీసుకొనుట వలన తక్కువ ప్రీమియంలు, అధిక మొత్తాల హామీ మరియు తక్కువ కో-పేమెంట్ డిమాండ్ వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు.
మీరు మీ 30 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వరకు దీని గురించి ఆలోచించకపోయినా ఏం పర్వాలేదు, మీకు లభించే సేవల గురించి పొందే మనశ్శాంతిని పరిగణనలోకి తీసుకుంటే అధిక ప్రీమియంలు కూడా చాలా విలువైనవే. మీ పదవీ విరమణకు ఇంకా ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటికీ, మీ పదవీ విరమణతో మీ యజమాని అందించే ఆరోగ్య భీమ ముగుస్తుందని గుర్తుంచుకోండి. మీకున్న క్లిష్టమైన అనారోగ్యాన్ని తొలగించి, దీర్ఘకాలికంగా భాదించే ఆరోగ్య సమస్యలను నయంచేయడానికి కావలసిన విధంగా మీరు ఈ భీమాను టాప్-అప్ కూడా చేయవచ్చు.
సమగ్ర ఆరోగ్య భీమా పొందడం ద్వారా కలిగే కొన్ని కీలకమైన ప్రయోజనాలు:
- వైద్యానికి అయిన ఖర్చులను సకాలంలో తిరిగి చెల్లించడం.
- క్లిష్టమైన కొన్ని అనారోగ్యాలకు నగదు మొత్తం ఒకేసారి చెల్లింపు.
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు వారికి రోజువారీ నగదును చెల్లించడం.
- ఆదాయపు పన్ను నుండి విముక్తి.
భీమ సంస్థలు చేసే సేవలు 60 యేళ్ల తరువాత మీ జీవితాన్ని సులభతరం చేస్తాయని మీరు భావిస్తే
, HDFC Life మీకు సరైన ఆరోగ్య బీమా పథకాలను అందిస్తుంది. సులభంగా చేసే యాడ్-ఆన్ లు, భీమాను పరిస్థితులకు అనువుగా మర్చుకొనుట, క్లిష్టమైన అనారోగ్య సమస్యలకు అయ్యే ఖర్చులు భరించ డం, శస్త్రచికిత్స ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు మరియు మరెన్నో సౌకర్యాలతో మీరు అనుకున్నదానికన్నా సులభంగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేసి వివిధ భీమా ఎంపికలను అన్వేషించి, మీకు నచ్చిన ఉత్తమమైన
భీమాను ఎంచుకోండి.
మెరుగైన ఆస్థి పన్ను ప్రయోజనాలను పొందడానికి మీ పోర్ట్‌ఫోలియోను విస్తరించండి.
మీ వృద్యాప్యాన్ని మెరుగైన విధంగా మలుచుకొనుటకు మరొక మార్గం ఏమిటంటే, మీ ఆరోగ్య పోర్ట్‌ఫోలియోను మరింత బలిష్టం చేసి పొదుపుల దిశగా ప్రయాణించాలి.
ఆరోగ్య భీమా పథకాలు - సెక్షన్ 80(డి) ఆరోగ్య భీమా ప్రీమియం ప్రకారం (60 సంవత్సరాల లోపు వారికి) రూ.15,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ మీరు వయోవృద్ధులు అయితే, మీకు 20,000 రూపాయల వరకు మినహాయింపు పరిమితి ఉంటుంది. తరుచుగా ఆరోగ్య పరీక్షలు చేసుకునే వారికి 15 వేల రూపాయలకు 5,000 రూపాయల తగ్గింపును పొందవచ్చు.
నిర్దిష్ట అనారోగ్య చికిత్సలు - మూత్రపిండాల జబ్బులు, క్యాన్సర్ మరియు ఎయిడ్స్ వంటి వ్యాధుల ఖర్చులకు సంబంధించిన విషయానికి వస్తే, వీరికి సెక్షన్ 80 డిడిబి కింద రూ.40,000 వరకు తగ్గింపును పొందుతారు. మీరు 60 సంవత్సరాలు దాటినప్పుడు ఈ పరిమితి రూ.65,000కు పెరుగుతుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) - పిపిఎఫ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల సెక్షన్ 80సి కింద లక్ష రూపాయల వరకు ఆదా అవుతుంది, అలానే మీకు లభించే ఆదాయానికి సెక్షన్ 10(10) డి కింద ఆదాయపు పన్ను నుండి విముక్తి పొందుతారు.
నెలవారీ ఆదాయ ప్రణాళికలు - ఈ రకమైన పెట్టుబడి ప్రణాళికతో, మీ ఆదాయానికి దీర్ఘకాలిక మూలధన లాభాల విభాగంలో పన్ను విధించబడుతుంది, ఇవి ఇన్డెక్సేషన్ లేకుండా 10శాతం మరియు ఇన్డెక్సేషన్ తో సహా 20శాతం ఉంటాయి.
మీరు ఎంత ఆదా చేయాలనేదాన్ని లెక్కించి ప్రారంభించండి.
భవిష్యత్తులో మీకు ఎలాంటి ఖర్చులు ఉంటాయో అర్థం చేసుకోవడానికి, ప్రస్తుతం మీరున్న పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీరు కనీసం మూడు సంవత్సరాల వరకు పరిస్థితులను అంచనా వేయగలిగి, మీరు దీనికి సంవత్సరానికి 10-15% జోడించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
మీ ఆహారపు అలవాట్లు, మీ జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య ప్రమాదాలు, మీకున్న అనారోగ్య చరిత్ర, వంశపారంపర్య అనారోగ్యాలతో పొంచియున్న ప్రమాదాలపై, అలాగే మీ జీవిత భాగస్వామి వైద్య అవసరాల గురించి కూడా ఆలోచించండి. భవిష్యత్తు ప్రణాళికలు చేస్తున్నప్పుడు పైన చెప్పిన విషయాలన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
మీకు ఆరోగ్య భీమా ఉన్నప్పటికీ, ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చులు, ప్రీ / పోస్ట్-హాస్పిటలైజేషన్ ఛార్జీలు వంటి ఖర్చులు మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇలాంటి వాటి కోసం అయ్యే ఖర్చులకు మీ సొంత డబ్బులను ఉపయోగించాల్సి వస్తుంది. 15-20 లక్షల భీమాతో ప్రారంభించి, తరువాత దానిని పెంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని.
మీరు 60 ఏళ్ళకు చేరుకునే ముందు మీకు మీరే ప్రశ్నించుకునే ఇతర ప్రశ్నలు:
- మీకున్న అనారోగ్య చరిత్ర, మీరున్న ప్రస్తుత స్థితిని పరిశీలిస్తే, మీకు ఈ కవరేజ్ సరిపోతుందా?
- మీ భీమా సంస్థలకు మీ సమీపంలో విస్తారమైన నెట్వర్క్ ఉందా?
- మీకున్న అనారోగ్య సమస్యలకు, లేదా అత్యవసర పరిస్థితుల్లో మీకు ఎలాంటి రక్షణ లభిస్తుంది?
మీ జీవితంలో గడిచిపొయిన కాలాన్ని వెనక్కి తీసుకరాలేనప్పటికీ, మీరు మీ వైద్య ఖర్చులను అంచనావేసి, కొంత మొత్తాన్ని పొదుపు చేసి, పెట్టుబడి కోసం ఒక ప్రణాళికను రూపొందించవచ్చు, అది మీ పదవీ విరమణ తరువాత మిమ్మల్ని వైద్య ఖర్చుల నుండి కాపాడుతుంది.
మీ కోసం మరియు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు విశ్వసించదగిన, అత్యంత నమ్మకంతో కూడిన ఆర్థిక రక్షణను పొందడానికి HDFC Life లోకి లాగిన్ అవ్వండి.
ఇది భాగస్వామ్య పోస్ట్.