హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Rate Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి భారీ షాక్.. ఒకేరోజు రూ.4 వేలకు పైగా పెరిగిన ధర!

Gold Rate Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి భారీ షాక్.. ఒకేరోజు రూ.4 వేలకు పైగా పెరిగిన ధర!

 బంగారం, వెండి కొనాలనుకునే వారికి భారీ షాక్.. ఒకేరోజు రూ.4 వేలకు పైగా పెరిగిన రేట్లు!

బంగారం, వెండి కొనాలనుకునే వారికి భారీ షాక్.. ఒకేరోజు రూ.4 వేలకు పైగా పెరిగిన రేట్లు!

Gold Silver Prices | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పండుగ సీజన్ ముందు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అలాగే వెండి రేటు అయితే అతిభారీగా పెరుగుతూ వస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Gold Price Today| బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. పండుగ సీజన్‌లో బంగారం ధరలు (Gold Rate) పరుగులు పెడుతున్నాయి. ఫెస్టివల్ డిమాండ్ సహా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు (Gold Price) పైపైకి చేరడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పుత్తడి తళుక్కు వల్ల ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం.

  హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా రూ. 550 మేర పరుగులు పెట్టింది. పది గ్రాముల బంగారం ధర రూ. 51,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు అయితే రూ. 500 ర్యాలీ చేసింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 47,350కు ఎగసింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. బంగారం ధరలు రెండు రోజుల్లోనే దాదాపు రూ.1000 మేర పైకి చేరింది. సిల్వర్ రేటు కూడా చుక్కలను అంటింది. ఒకేరోజు వెండి ధర కేజీకి రూ. 4,200 పెరిగింది. దీంతో సిల్వర్ రేటు రూ. 66,700కు చేరింది.

  ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే ఈ 6 మార్గాల్లో డబ్బు సంపాదించండి!

  అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దీని వల్ల దేశీ మార్కెట్‌లో కూడా ట్రెండ్ సానుకూలముగా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు మూడు వారాల గరిష్టానికి చేరింది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, డాలర్ బలహీనపడటం ( నాలుగు రోజుల్లో 2 శాతం పడిపోయింది) వంటి అంశాలు బంగారం ధర పరుగులు పెట్టడానికి దోహదపడ్డాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.98 శాతం మేర పెరిగింది. ఔన్స్‌కు బంగారం ధర 1719 డాలర్లకు ఎగసింది. అలాగే వెండి రేటు భారీగా పెరిగింది. ఏకంగా 2.18 శాతం ర్యాలీ చేసింది. ఔన్స్‌కు 21 డాలర్ల పైకి చేరింది.

  శుభవార్త.. భారీగా తగ్గిన ఈ 11 నిత్యావసర వస్తువుల ధరలు!

  మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్‌లో బంగారం ధరలు కొండెక్కాయి. ఎంసీఎక్స్ గోల్డ్ రేటు 0.72 శాతం మేర పెరిగింది. పది గ్రాములకు బంగారం ధర రూ. 51,530 స్థాయికి చేరింది. అలాగే ఎంసీఎక్స్ వెండి రేటు కూడా భారీగా పెరిగింది. రూ. 850 మేర పైకి చేరింది. కేజీకి రూ. 61,760 స్థాయికి చేరింది. అంటే బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gold, Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today, Silver price, Silver rate

  ఉత్తమ కథలు