MC insider: బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రపంచంలో ఏ జరుగుతోంది?

Hush-hush tales: ఆఫ్ ది రికార్డ్ న్యూస్ అంటే అందరికీ ఇష్టమే. అలాంటి ఆసక్తికర న్యూస్ ఇప్పుడు తెలుసుకుందాం. మన స్టాక్ మార్కెట్లు, బ్యాంకింగ్, కార్పొరేట్ ప్రపంచంలో ఏం జరుగుతుందో గ్రహిద్దాం.

news18-telugu
Updated: November 2, 2020, 1:04 PM IST
MC insider: బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రపంచంలో ఏ జరుగుతోంది?
బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రపంచంలో ఏ జరుగుతోంది?
  • Share this:
WFH RISKS: కరోనా వచ్చాక... ఇండియా సహా ప్రపంచ దేశాల్లోని చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇది బాగా కనిపిస్తోంది. ఐతే... ఆఫీసుల్లో పని చేసేటప్పుడు కింది స్థాయి ఉద్యోగులపై బాసులు ఓ కన్నేసి ఉంచేందుకు వీలయ్యేది. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అలా జరగట్లేదు. అది తీవ్రమైన నష్టాలకు దారి తీస్తోందని తెలిసింది. ఉదాహరణకు... ఓ టెక్ కంపెనీ... ఓ భారీ ప్రాజెక్టు విషయంలో జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి... చివరి నిమిషంలో నష్టం జరగకుండా జాగ్రత్త పడింది. ఆ ప్రాజెక్టులో తన కస్టమర్లకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఉంది. అది లీకవ్వడానికి వీల్లేదు. ఐతే... కొత్తగా చేరిన ఓ ఉద్యోగి... కస్టమర్ల డేటాను కాపీ చేయడానికి ప్రయత్నించాడు. ఇందుకోసం ఓ ఇంటర్నల్ టూల్ ఉపయోగించాడు. ఇలా ఉపయోగించే ఛాన్స్ ఆ కంపెనీలో అందరు ఉద్యోగులకూ ఉంది. ఐతే... ఉద్యోగి చేసిన కుట్రను వెంటనే మేనేజర్లు కనిపెట్టారు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ కొత్త ఉద్యోగిని వెంటనే సర్వీస్ నుంచి తొలగించారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల.

DADAGIRI AT PLAY: గతేడాది ఓ కంపెనీ ఇండియాలోని దేశీయ యూనీకార్న్ క్లబ్‌లో చేరిన మొదటి గేమింగ్ కంపెనీగా మారింది. ఈ సంవత్సరం మరింత గ్రేట్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ దేశంలోనే అతి పెద్ద వార్షిక క్రీడా కార్యక్రమానికి సంబంధించిన టైటిల్ స్పాన్సర్ షిప్ రైట్స్ పొందినట్లు తెలిపింది. ఐతే... ఆ తర్వాత కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఓ సీనియర్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారి... ఈ కంపెనీకి రైట్స్ దక్కేలా చేసినట్లు తెలిసింది. ఆ అధికారి... ప్రతిఫలానికి ప్రతిఫలంగా ఇలా పావులు కదిపినట్లు తెలిసింది. వెంటనే చర్యల్లో భాగంగా... చైనా కంపెనీకి టైటిల్ స్పాన్సర్ షిప్ రైట్స్ తొలగించారు. వందల కోట్ల నష్టాన్ని తప్పించినట్లైంది. ఇది సరైన స్పోర్ట్స్ కంపెనీ కాదనే కారణంతో రైట్స్ నుంచి తొలగించారు.

GUESS WHO STUMPED KBC 12?: కరోనా ఉన్నా, లేకపోయినా... క్రికెట్ అనేది ఇండియాలో ఓ మతమే. IPL మరోసారి దాన్ని నిరూపించింది. ఈ సంవత్సరం ఐపీఎల్... కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) క్విజ్ షో వ్యూవర్ షిప్‌పై దెబ్బకొట్టింది. దీని వల్ల కేబీసీ రెవెన్యూ అడ్డంగా పడిపోయినట్లు తెలిసింది. ఈసారి 12వ ఎడిషన్ షో... తన స్పాన్షర్ షిప్ డీల్స్ ప్రీమియంలో ఏ మార్పులూ చెయ్యలేకపోయింది. స్పాట్ యాడ్ రేట్లు కూడా పెంచలేకపోయింది. ఈ సంవత్సరం కేబీసీ రూ.35-40 కోట్లు అలాగే... సహ సమర్పణ డీల్స్ ద్వారా మరో రూ.25 కోట్లు రాబట్టగలదనుకుంటున్నారు. గతేడాదీ అంతే వచ్చింది. యాడ్ కొనేందుకు స్పాట్ రేట్ గతేడాది రూ.3.5 లక్షలు ఉండగా... ఈసారీ అంతే ఉంది. షో నిర్వాహకులు మాత్రం... ఇవన్నీ కొట్టిపారేస్తున్నారు. షో బాగా నడుస్తోందంటున్నారు.

ELUSIVE PEACE: కార్పొరేట్ ప్రపంచంలో ఓ వివాదం ముగిసిపోతుందిలే అనుకుంటే తిరిగి రచ్చ రేపుతున్నట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య ఈ వివాదం సెటిల్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఓ పార్టీ... మీడియా ప్రతినిధులను కలిసి... ప్రత్యర్థికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అందువల్ల ప్రశాంతత లేనట్లే. ఈమధ్యే ఓ పార్టీ తేలికైన సొల్యూషన్‌ను ఆఫర్ చెయ్యగా... మరో పార్టీ అందుకు ఒప్పుకోలేదు. చూస్తుంటే... ఇది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియట్లేదు. దీనిపై కోర్టే జోక్యం చేసుకొని సద్దుమణిగేలా చేయడం బెటరనిపిస్తోంది.

HEALTHY IDEA: ఓ ప్రముఖ హెల్త్ కేర్ గ్రూప్... ఐటీ ఇండస్ట్రీతో సంబంధం ఉన్నది... స్వయంగా హెల్త్ కేర్ స్కీమ్ ప్రారంభించాలనుకుంటోంది. తక్కువ ఆదాయం పొందే ఫ్యామిలీలకు... మేలు చేసేలా ఆ స్కీమ్ ఉందని తెలిసింది. ప్రస్తుతం ఇండియాలో ఇలాంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్, యూనివర్శల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి లేకపోవడంతో... ఈ స్కీమ్ మంచిదే అనే అభిప్రాయం వస్తోంది. దీని ద్వారా.. తక్కువ సబ్‌స్క్రిప్షన్‌కే త్వరగా డయాగ్నోసిస్, త్వరగా ట్రీట్‌మెంట్ వంటివి అందిస్తారని తెలిసింది.

ON/OFF THE RECORD: కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల నుంచి వార్తలు తెలిపేందుకు చక్కటి విధానం ఉంది. చాలా మంత్రిత్వ శాఖలు... స్వయంగా ప్రతినిధులను కలిగివున్నాయి. వాళ్లు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (iis) కేడర్ వాళ్లు. ఐతే... ప్రతిసారీ మంత్రులు సొంత మీడియా సలహాదారులను కలిగిలేరు. ఇదే సమయంలో... రైసినా హిల్ లోని... ఓ కీలక మంత్రిత్వ శాఖలోని ఓ ప్రభావవంతమైన, శక్తిమంతమైన అధికారి... తనకంటూ సొంత మీడియా సలహాదారును ఉంచుకున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వంలో ఈ కార్యదర్శి మాత్రమే ఇలాంటిది కలిగివున్నట్లు తెలిసింది. చాలా సందర్భాల్లో మీడియా సలహాదారులు రిపోర్టర్లకు ప్రెస్ రీలీజ్లు డైరెక్టుగా ఇస్తుంటారు. ఇలాంటివి చాలా వరకూ ఆఫ్ ద రికార్డులా ఉంటాయి. వీటికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇలాంటి ప్రెస్ రిపోర్టులు మంత్రిత్వ శాఖలను మెచ్చుకుంటూ ఉంటాయి. దీనిపై రిపోర్టర్లు అభ్యంతరాలు చెబుతున్నా... బాసులు మాత్రం... లైట్ తీసుకుంటున్నట్లు తెలిసింది.

LOW-PROFILE CEO: ఓ బ్యాంకు సీఈఓను... మీడియా ముందుకొచ్చి మాట్లాడాల్సిందిగా... బ్యాంకుకి చెందిన కమ్యూనికేషన్ టీమ్, పీఆర్ టీమ్ ఎంత కోరుతున్నా ప్రయోజనం కనిపించట్లేదట. ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ నింపాలంటే... మీడియా ముందుకు రావడం మేలని వారు చెబుతున్నా... ఆ సీఈఓ మాత్రం ముందుకు రావట్లేదు. కనీసం క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిజల్స్ట్ ప్రకటించినప్పుడు కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టట్లేదట. ప్రస్తుతం బ్యాంక్ బాగానే ఉన్నా... గత చరిత్ర సమస్యగా ఉంది. దానికి తాను బాధ్యుణ్ని కాదు కాబట్టి... తాను స్పందించాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో సీఈఓ ఉన్నట్లు తెలిసింది.

Note to the Readers : Chances are you love a juicy story as much as we hacks do and you might have one to share. Please share the story in an email to MCInsider@nw18.com.

Also, spare a moment to tell us what you think of this series. Send your hosannas and howls to the same email address.
Published by: Krishna Kumar N
First published: November 2, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading